Nee saranam kamalam mrdulam

నీ చరణం కమలం మృదులం
Year
Language

పల్లవి:

నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం
నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం
నీ పాదాలే రస వేదాలు నను కరిగించే నవ నాదాలు
అవి యదలో ఉంచిన చాలు.. ఏడేడు జన్మాలు…

నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం
నీ పాదాలే రస వేదాలు నను కరిగించే నవ నాదాలు
అవి యదలో ఉంచిన చాలు ఏడేడు జన్మాలు…

నీ చరణం కమలం

చరణం 1:

మువ్వలు పలికే మూగతనంలో మోమున మోహన రాగాలు
కన్నులు పలికే కలికితనంలో చూపున సంధ్యారాగాలు ||2||

అంగ అంగమున అందచందములు ఒంపు ఒంపున హంపి శిల్పములు ||2||
ఎదుటే నిలిచిన చాలు.. ఆరారు కాలాలు…

చరణం 2:

జతులే పలికే జాణతనంలో జారే పైటల కెరటాలు
శృతులే కలిసే రాగతనంలో పల్లవించిన పరువాలు ||2||
అడుగు అడుగున రంగవల్లికలు పెదవి అడుగున రాగమాలికలు||2||
ఎదురై పిలిచినా చాలు.... నీ మౌన గీతాలు

pallavi:

nī saraṇaṁ kamalaṁ mṛdulaṁ nā hṛdayaṁ padilaṁ padilaṁ
nī saraṇaṁ kamalaṁ mṛdulaṁ nā hṛdayaṁ padilaṁ padilaṁ
nī pādāle rasa vedālu nanu karigiṁche nava nādālu
avi yadalo uṁchina sālu.. eḍeḍu janmālu…

nī saraṇaṁ kamalaṁ mṛdulaṁ nā hṛdayaṁ padilaṁ padilaṁ
nī pādāle rasa vedālu nanu karigiṁche nava nādālu
avi yadalo uṁchina sālu eḍeḍu janmālu…

nī saraṇaṁ kamalaṁ

saraṇaṁ 1:

muvvalu palige mūgadanaṁlo momuna mohana rāgālu
kannulu palige kaligidanaṁlo sūbuna saṁdhyārāgālu ||2||

aṁga aṁgamuna aṁdasaṁdamulu ŏṁpu ŏṁpuna haṁpi śhilbamulu ||2||
ĕduḍe nilisina sālu.. ārāru kālālu…

saraṇaṁ 2:

jadule palige jāṇadanaṁlo jāre paiḍala kĕraḍālu
śhṛtule kalise rāgadanaṁlo pallaviṁchina paruvālu ||2||
aḍugu aḍuguna raṁgavalligalu pĕdavi aḍuguna rāgamāligalu||2||
ĕdurai pilisinā sālu.... nī mauna gīdālu