Nee needagaa nannu kadalaadanee

నీ నీడగా నన్ను కదలాడనీ
Year
Language

పల్లవి:

నీ నీడగా నన్ను కదలాడనీ
నీ గుండెలో నన్ను నిదురించనీ...ఈ..ఈ..
నీ నీడగా నన్ను కదలాడనీ

నీ చూపులోనా ప్రణయాల వానా
శతకోటి రాగాలు కురిపించనీ..మైమరపించనీ..
నీ నీడగా నన్ను కదలాడనీ
నీ గుండెలో నన్ను నిదురించనీ...ఈ..ఈ..
నీ నీడగా నన్ను కదలాడనీ

చరణం 1:

జాజులు తెలుపు...
జాబిల్లి తెలుపు ...
నను మురిపించే నీ మనసు తెలుపు...

కుంకుమ ఎరుపు...
కెంపులు ఎరుపు...
సుధలూరే నీ అధరాలు ఎరుపు...

అనురాగాలే అనుబంధాలై...
అనురాగాలే అనుబంధాలై...నిన్ను నన్ను ముడివేయనీ
మది పాడనీ...

నీ నీడగా నన్ను కదలాడనీ
నీ గుండెలో నన్ను నిదురించనీ...ఈ...ఈ
నీ నీడగా నన్ను కదలాడనీ

చరణం 2:

హరివిల్లు చూశా..నీ మేని చూశా
హరివిల్లులో లేని హొయలుంది నీలో...

సెలయేరు చూశా...నీ దుడుకు చూశా
సెలయేటిలో లేని చొరవుంది నీలో...

తీయని చెలిమి తరగని కలిమి...
తీయని చెలిమి తరగని కలిమి
మనలో.. మదిలో.. కొనసాగనీ..ఊయలలూగనీ

నీ నీడగా నన్ను కదలాడనీ
నీ గుండెలో నన్ను నిదురించనీ...
నీ చూపులోనా ప్రణయాల వానా
శతకోటి రాగాలు కురిపించనీ..మైమరపించనీ..
నీ నీడగా నన్ను కదలాడనీ..
నీ గుండెలో నన్ను నిదురించనీ....

pallavi:

nī nīḍagā nannu kadalāḍanī
nī guṁḍĕlo nannu niduriṁchanī...ī..ī..
nī nīḍagā nannu kadalāḍanī

nī sūbulonā praṇayāla vānā
śhadagoḍi rāgālu kuribiṁchanī..maimarabiṁchanī..
nī nīḍagā nannu kadalāḍanī
nī guṁḍĕlo nannu niduriṁchanī...ī..ī..
nī nīḍagā nannu kadalāḍanī

saraṇaṁ 1:

jājulu tĕlubu...
jābilli tĕlubu ...
nanu muribiṁche nī manasu tĕlubu...

kuṁkuma ĕrubu...
kĕṁpulu ĕrubu...
sudhalūre nī adharālu ĕrubu...

anurāgāle anubaṁdhālai...
anurāgāle anubaṁdhālai...ninnu nannu muḍiveyanī
madi pāḍanī...

nī nīḍagā nannu kadalāḍanī
nī guṁḍĕlo nannu niduriṁchanī...ī...ī
nī nīḍagā nannu kadalāḍanī

saraṇaṁ 2:

harivillu sūśhā..nī meni sūśhā
harivillulo leni hŏyaluṁdi nīlo...

sĕlayeru sūśhā...nī duḍugu sūśhā
sĕlayeḍilo leni sŏravuṁdi nīlo...

tīyani sĕlimi taragani kalimi...
tīyani sĕlimi taragani kalimi
manalo.. madilo.. kŏnasāganī..ūyalalūganī

nī nīḍagā nannu kadalāḍanī
nī guṁḍĕlo nannu niduriṁchanī...
nī sūbulonā praṇayāla vānā
śhadagoḍi rāgālu kuribiṁchanī..maimarabiṁchanī..
nī nīḍagā nannu kadalāḍanī..
nī guṁḍĕlo nannu niduriṁchanī....