Nee navvule vennelani

నీ నవ్వులే వెన్నెలని
Work
Year
Language

పల్లవి:

నీ నవ్వులే వెన్నెల్లని మల్లెలని హరివిల్లులని
ఎవరేవేవో అంటె అననీ యేం చెప్పను యేవి చాలవని
నీ నవ్వులే వెన్నెల్లని మల్లెలని హరివిల్లులని
ఎవరేవేవో అంటె అననీ యేం చెప్పను యేవి చాలవని

చరణం 1:

బంగారం వెలిసి పోదా నీ సొగసుని చూసి
మందారం మురిసిపోదా నీ సిగలో పూసి
వేవేల పువ్వులను పోగేసి నిలువెత్తు పాల బొమ్మని చేసి
అణువణువు వెండి వెన్నెల పూసి విరి తేనే తోనే ప్రాణం పోసి
ఆ బ్రహ్మ నిను మళ్ళి మళ్ళి చూసి
తన్ను తానే మెచ్చుకోడా ముచ్చటేసి
ఎవరేవేవో అంటె అననీ యేం చెప్పను యేవి చాలవని

చరణం 2:

పగలంత వెంట పడిన చూడవు నా వైపు
రాతిరంత కొంటె కలవై వదలవు కాసేపు
ప్రతి చోట నువ్వే యెదురొస్తావు
ఎటు వెళ్ళలేని వలవేస్తావు
చిరునవ్వుతోనె ఉరివేస్తావు
నన్నెందుకింత ఊరిస్తావు
ఒప్పుకోవేం నువ్వు చేసిందంతా చేసి...
తప్పు నాదంటావ నానా నిందలేసి

pallavi:

nī navvule vĕnnĕllani mallĕlani harivillulani
ĕvarevevo aṁṭĕ ananī yeṁ sĕppanu yevi sālavani
nī navvule vĕnnĕllani mallĕlani harivillulani
ĕvarevevo aṁṭĕ ananī yeṁ sĕppanu yevi sālavani

saraṇaṁ 1:

baṁgāraṁ vĕlisi podā nī sŏgasuni sūsi
maṁdāraṁ murisibodā nī sigalo pūsi
vevela puvvulanu pogesi niluvĕttu pāla bŏmmani sesi
aṇuvaṇuvu vĕṁḍi vĕnnĕla pūsi viri tene tone prāṇaṁ posi
ā brahma ninu maḽḽi maḽḽi sūsi
tannu tāne mĕchchugoḍā muchchaḍesi
ĕvarevevo aṁṭĕ ananī yeṁ sĕppanu yevi sālavani

saraṇaṁ 2:

pagalaṁta vĕṁṭa paḍina sūḍavu nā vaibu
rādiraṁta kŏṁṭĕ kalavai vadalavu kāsebu
pradi soḍa nuvve yĕdurŏstāvu
ĕḍu vĕḽḽaleni valavestāvu
sirunavvudonĕ urivestāvu
nannĕṁdugiṁta ūristāvu
ŏppugoveṁ nuvvu sesiṁdaṁtā sesi...
tappu nādaṁṭāva nānā niṁdalesi