Nee navvula telladanaanni naagamalli ap

నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్
Work
Year
Language

పల్లవి:

నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది
ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు
నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది
ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు
నీ కోకను సీతాకోక
నీ పలుకులు చిలకల మూక
నీ చూపును చంద్రలేఖ
నీ పొంగును ఏరువాక
బదులిమ్మంటూ బతిమాలాయి
ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు
అసలివ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు

నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది
ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు

చరణం 1:

నీ బుగ్గల్లోని సిగ్గులు కొన్ని మొగ్గలకైన ఇవ్వద్దు
నా వైపే మొగ్గిన నీకైతే అవి మొత్తం ఇవ్వచు

నీ బాసల్లోని తియ్యదనాన్ని తెలుగు భాషకే ఇవ్వద్దు
నా కోసం వేచే నీకైతే అది రాశిగా ఇవ్వచు

భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు...
భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు
నీకే మొక్కే నాకే ఇవ్వచు

చరణం 2:

నీ అందం పొగిడే అవకాశాన్ని కవులకు సైతం ఇవ్వద్దు
మరి నాకై పుట్టిన నీకైతే అది పూర్తిగా ఇవ్వచు

నీ భారం మోసే అదృష్టాన్నే భూమికి సైతం ఇవ్వద్దు
నేనంటే మెచ్చిన నీకైతే అది వెంటనే ఇవ్వచు

నిన్ను హత్తుకుపోయే భాగ్యాన్ని నీ దుస్తులకైన ఇవ్వద్దు ...
నిన్ను హత్తుకుపోయే భాగ్యాన్ని నీ దుస్తులకైన ఇవ్వద్దు
నీకై బ్రతికే నాకే ఇవ్వచు

చరణం 3:

నా వాకిట ముగ్గులు నీకే నా దోసిట మల్లెలు నీకే
నా పాపటి వెలుగులు నీకే నా మాపటి మెరుపులు నీకే
ప్రాణం ప్రణయం అన్ని నీకే ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా
బదులిచేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా .

pallavi:

nī navvula tĕlladanānni nāgamalli appaḍigiṁdi
ivvaddu ivvaddu ivvaddu
nī pĕdavula ĕrradanānni goriṁṭāge aruvaḍigiṁdi
ivvaddu ivvaddu ivvaddu
nī koganu sīdāgoga
nī palugulu silagala mūga
nī sūbunu saṁdralekha
nī pŏṁgunu eruvāga
badulimmaṁṭū badimālāyi
ivvaddu ivvaddu ivvaddu
asalivvaddu ivvaddu ivvaddu

nī navvula tĕlladanānni nāgamalli appaḍigiṁdi
ivvaddu ivvaddu ivvaddu

saraṇaṁ 1:

nī buggalloni siggulu kŏnni mŏggalagaina ivvaddu
nā vaibe mŏggina nīgaide avi mŏttaṁ ivvasu

nī bāsalloni tiyyadanānni tĕlugu bhāṣhage ivvaddu
nā kosaṁ vese nīgaide adi rāśhigā ivvasu

bhakti śhraddha edainā bhagavaṁtunige ivvaddu...
bhakti śhraddha edainā bhagavaṁtunige ivvaddu
nīge mŏkke nāge ivvasu

saraṇaṁ 2:

nī aṁdaṁ pŏgiḍe avagāśhānni kavulagu saidaṁ ivvaddu
mari nāgai puṭṭina nīgaide adi pūrdigā ivvasu

nī bhāraṁ mose adṛṣhṭānne bhūmigi saidaṁ ivvaddu
nenaṁṭe mĕchchina nīgaide adi vĕṁṭane ivvasu

ninnu hattuguboye bhāgyānni nī dustulagaina ivvaddu ...
ninnu hattuguboye bhāgyānni nī dustulagaina ivvaddu
nīgai bradige nāge ivvasu

saraṇaṁ 3:

nā vāgiḍa muggulu nīge nā dosiḍa mallĕlu nīge
nā pābaḍi vĕlugulu nīge nā mābaḍi mĕrubulu nīge
prāṇaṁ praṇayaṁ anni nīge ichchestā ichchestā ichchestā
badulisestā ichchestā ichchestā ichchestā .