పల్లవి:
నీ కోసం నీ కోసం
నా గానం నా ప్రాణం నీ కోసం ||2||
చరణం 1:
నీ కన్నుల వెలుగులో నీలి నీడలెందుకో
నీ కన్నుల వెలుగులో నీలి నీడేందుకో
నీ వెన్నెల మోములో ఈ విషాదమెందుకో
నీ బాధను పంచుకొనగ నేనుంటిని కాదా
నేనుంటిని కాదా
చరణం 2:
నింగి నిదుర పోయే నేల నిదురపోయే
నింగి నిదుర పోయే నేల నిదురపోయే
గాలి నిదుర పోయే లోకాలే నిదుర పోయే
నా హృదయమే నీ పానుపుగా నిదురించగ లేవా
నిదురించగ రావా
pallavi:
nī kosaṁ nī kosaṁ
nā gānaṁ nā prāṇaṁ nī kosaṁ ||2||
saraṇaṁ 1:
nī kannula vĕlugulo nīli nīḍalĕṁdugo
nī kannula vĕlugulo nīli nīḍeṁdugo
nī vĕnnĕla momulo ī viṣhādamĕṁdugo
nī bādhanu paṁchugŏnaga nenuṁṭini kādā
nenuṁṭini kādā
saraṇaṁ 2:
niṁgi nidura poye nela niduraboye
niṁgi nidura poye nela niduraboye
gāli nidura poye logāle nidura poye
nā hṛdayame nī pānubugā niduriṁchaga levā
niduriṁchaga rāvā