పల్లవి:
నీ అందం నీ పరువం నాలో దాచుకో
కాలం తెలియని బిగి కౌగిలిలో నన్నే దాచుకో ఓ..
ఈ అందం ఈ పరువం నీకే అంకితం
రేయి పగలు వెన్నెలా కాదా నీతో జీవితం
చరణం 1:
వీచే గాలి పూచే పూలు గుసగుసలాడాయి
కోరికలన్నీ తీరేదెపుడని రెపరెపలాడాయి (వీచే గాలి)
ఆ తొందర చూసి ఎగిరే గువ్వలు కిలకిల నవ్వాయి //నీ అందం//
చరణం 2:
వలచిన నింగి ప్రేయసి కోసం వానై కురిసిందీ
ఆ వానకు తడిసిన భూమి గుండెలో ఆవిరి ఎగిసిందీ (వలచిన)
ఆ కలియికలోనే నింగి నేల జతగా మురిసేదీ //నీ అందం//
pallavi:
nī aṁdaṁ nī paruvaṁ nālo dāsugo
kālaṁ tĕliyani bigi kaugililo nanne dāsugo o..
ī aṁdaṁ ī paruvaṁ nīge aṁkidaṁ
reyi pagalu vĕnnĕlā kādā nīdo jīvidaṁ
saraṇaṁ 1:
vīse gāli pūse pūlu gusagusalāḍāyi
korigalannī tīredĕbuḍani rĕbarĕbalāḍāyi (vīse gāli)
ā tŏṁdara sūsi ĕgire guvvalu kilagila navvāyi //nī aṁdaṁ//
saraṇaṁ 2:
valasina niṁgi preyasi kosaṁ vānai kurisiṁdī
ā vānagu taḍisina bhūmi guṁḍĕlo āviri ĕgisiṁdī (valasina)
ā kaliyigalone niṁgi nela jadagā murisedī //nī aṁdaṁ//