Navvulu ruvve puvvammaa..

నవ్వులు రువ్వే పువ్వమ్మా..
Year
Language

పల్లవి:

నవ్వులు రువ్వే పువ్వమ్మా...
నవ్వులు రువ్వే పువ్వమ్మా...
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా..
వున్న నాలుగు నాళ్ళు నీలా ఉండిపోతే చాలమ్మా..

నవ్వులు రువ్వే పువ్వమ్మా...
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా...ఓ పువ్వమ్మ
!! నవ్వులు రువ్వే!!

చరణం 1:

ఆకుల పయ్యెదలో నీ ఆడతనాన్ని దాచావు...
రేకుల కెంపులలో నీ రేపటి ఆశలు నింపావు..
ఆ ముసుగు తీసిన ముద్దు ముఖాన మొగ్గ సొగసే వుందమ్మా.. !! నవ్వులు రువ్వే!!

చరణం 2:

ఈ తోట మొత్తము కమ్మినవీ.. నీ దోరవయసు అందాలు..
ఈ గాలి మత్తులో వున్నవీ.. నీ కన్నె మనసులో కైపులు..

ఈ తోట మొత్తము కమ్మినవీ.. నీ దోరవయసు అందాలు..
ఈ గాలి మత్తులో వున్నవీ.. నీ కన్నె మనసులో కైపులు..

నువ్వు ఒలకబోసే ఒంపుసొంపులకు ఒడిని పడతానుండమ్మా... !!నవ్వులు రువ్వే!!

చరణం 3:

ఏ కొమ్మకు పూచావో.. ఏ కమ్మని తేనెలు తెచ్చావో..
ఏ పాటకు మురిసేవో..ఏ తేటికి విందులు చేసేవో..
ఆ పాట గానో.. తేటి గానో.. పదినాళ్ళున్నా చాలమ్మా.. !!నవ్వులు రువ్వే!!

pallavi:

navvulu ruvve puvvammā...
navvulu ruvve puvvammā...
nī navvulu nāgu ivvammā..
vunna nālugu nāḽḽu nīlā uṁḍibode sālammā..

navvulu ruvve puvvammā...
nī navvulu nāgu ivvammā...o puvvamma
!! navvulu ruvve!!

saraṇaṁ 1:

āgula payyĕdalo nī āḍadanānni dāsāvu...
regula kĕṁpulalo nī rebaḍi āśhalu niṁpāvu..
ā musugu tīsina muddu mukhāna mŏgga sŏgase vuṁdammā.. !! navvulu ruvve!!

saraṇaṁ 2:

ī toḍa mŏttamu kamminavī.. nī doravayasu aṁdālu..
ī gāli mattulo vunnavī.. nī kannĕ manasulo kaibulu..

ī toḍa mŏttamu kamminavī.. nī doravayasu aṁdālu..
ī gāli mattulo vunnavī.. nī kannĕ manasulo kaibulu..

nuvvu ŏlagabose ŏṁpusŏṁpulagu ŏḍini paḍadānuṁḍammā... !!navvulu ruvve!!

saraṇaṁ 3:

e kŏmmagu pūsāvo.. e kammani tenĕlu tĕchchāvo..
e pāḍagu murisevo..e teḍigi viṁdulu sesevo..
ā pāḍa gāno.. teḍi gāno.. padināḽḽunnā sālammā.. !!navvulu ruvve!!