Navvaalamte ...

నవ్వాలంటే ...
Year
Language

పల్లవి:

నవ్వాలంటే సందేహం మాని నవ్వేయంతే
నమ్మావంటే సంతోషాలన్నీ నీవైనట్టే
పరదాలు లేనితనముంటే పహరాలు దాటమని అంటే
పసివాళ్ళ లోని గుణముంటే పరవాలు లేవు అనుకుంటే
పరదాలు లేనితనముంటే పహరాలు దాటమని అంటే
పసివాళ్ళ లోని గుణముంటే పరవాలు లేవు అనుకుంటే

తొడగవా తలపులకు రెక్కలూ
తొలగవా ఉలికి పడి దిక్కులూ
పలకవా ఎదురుపడి చుక్కలూ
తెలుపవా ఎదకు తన హక్కులూ

నవ్వాలంటే సందేహం మాని నవ్వేయంతే
నమ్మావంటే సంతోషాలన్నీ నీవైనట్టే

చరణం 1:

తరగని బరువైతే దిగులు
జరగవు సరిగా ఏ పనులు
త్వరపడి తరిమేసేయ్ అవి మనకవసరమా
మనసున కొలువైతే గుబులు
మననొదలుదుగా రే పగలు
పొరపడి చోటిస్తే తదుపరి మన తరమా

నీకే నువ్వు ఇరుకైపోవ ఏకాంతాన ఉంటే
సరదాలోని స్వరమైపోవ పదుగురు పక పక వింటే

పలకవా ఎదురుపడి చుక్కలూ
తెలుపవా ఎదకు తన హక్కులూ
తొడగవా తలపులకు రెక్కలూ
తొలగవా ఉలికి పడి దిక్కులూ

నవ్వాలంటే సందేహం మాని నవ్వేయంతే
నమ్మావంటే సంతోషాలన్నీ నీవైనట్టే

చరణం 2:

నదులను నిలుపదుగా అలుపు
ఎద లయకుండదుగా మరుపు
కలలకు అంటదుగా నడిరాతిరి నలుపూ
చినుకుల చలి బడినీ పిలుపు
తడి తడి చెలిమితో నీ కొరకు
గగనము దిగి వస్తే వెయ్యకు యే గొడుగూ

వీచేగాలి సొంతిల్లంది అందరి గుండెల్లోనా
ఒంటరి వాళ్ళు ఎవరుంటారు ఇంత ప్రపంచంలోనా

పలకవా ఎదురుపడి చుక్కలూ
తెలుపవా ఎదకు తన హక్కులూ
తొడగవా తలపులకు రెక్కలూ
తొలగవా ఉలికి పడి దిక్కులూ

నవ్వాలంటే సందేహం మాని నవ్వేయంతే ఓ ఓ
నమ్మావంటే సంతోషాలన్నీ నీవైనట్టే ఓ ఓ

pallavi:

navvālaṁṭe saṁdehaṁ māni navveyaṁte
nammāvaṁṭe saṁtoṣhālannī nīvainaṭṭe
paradālu lenidanamuṁṭe paharālu dāḍamani aṁṭe
pasivāḽḽa loni guṇamuṁṭe paravālu levu anuguṁṭe
paradālu lenidanamuṁṭe paharālu dāḍamani aṁṭe
pasivāḽḽa loni guṇamuṁṭe paravālu levu anuguṁṭe

tŏḍagavā talabulagu rĕkkalū
tŏlagavā uligi paḍi dikkulū
palagavā ĕdurubaḍi sukkalū
tĕlubavā ĕdagu tana hakkulū

navvālaṁṭe saṁdehaṁ māni navveyaṁte
nammāvaṁṭe saṁtoṣhālannī nīvainaṭṭe

saraṇaṁ 1:

taragani baruvaide digulu
jaragavu sarigā e panulu
tvarabaḍi tarimesey avi managavasaramā
manasuna kŏluvaide gubulu
mananŏdaludugā re pagalu
pŏrabaḍi soḍiste tadubari mana taramā

nīge nuvvu irugaibova egāṁtāna uṁṭe
saradāloni svaramaibova paduguru paga paga viṁṭe

palagavā ĕdurubaḍi sukkalū
tĕlubavā ĕdagu tana hakkulū
tŏḍagavā talabulagu rĕkkalū
tŏlagavā uligi paḍi dikkulū

navvālaṁṭe saṁdehaṁ māni navveyaṁte
nammāvaṁṭe saṁtoṣhālannī nīvainaṭṭe

saraṇaṁ 2:

nadulanu nilubadugā alubu
ĕda layaguṁḍadugā marubu
kalalagu aṁṭadugā naḍirādiri nalubū
sinugula sali baḍinī pilubu
taḍi taḍi sĕlimido nī kŏragu
gaganamu digi vaste vĕyyagu ye gŏḍugū

vīsegāli sŏṁtillaṁdi aṁdari guṁḍĕllonā
ŏṁṭari vāḽḽu ĕvaruṁṭāru iṁta prabaṁchaṁlonā

palagavā ĕdurubaḍi sukkalū
tĕlubavā ĕdagu tana hakkulū
tŏḍagavā talabulagu rĕkkalū
tŏlagavā uligi paḍi dikkulū

navvālaṁṭe saṁdehaṁ māni navveyaṁte o o
nammāvaṁṭe saṁtoṣhālannī nīvainaṭṭe o o