Nallaa nallaani kalla pillaa nee moguday

నల్లా నల్లాని కళ్ళ పిల్లా నీ మొగుడయ్
Work
Year
Language

పల్లవి:

నల్లా నల్లాని కళ్ళ పిల్లా నీ మొగుడయ్యే
వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారేసరికల్లా నే జిల్లాలన్ని వెతికి వాణ్ణెల్లాగోలాగ
తెచ్చి పెళ్ళి చేసేస్తానమ్మా

చరణం 1:

ఎర్రంగా బొద్దుగా ఉంటే చాలా
వొళ్ళోపెట్టుకు లాలి పాడి జోకొట్టాలా
అడుగులకే మడుగులు ఒత్తే వాడే మేలా
మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాలా
ఉప్పుల గుప్పా వయ్యారి భామా
ముద్దుల గుమ్మ చెప్పవె బొమ్మా

ఉప్పుల గుప్పకి వయ్యారి భామకి
నచ్చిన మొగుడివి నువ్వేనమ్మా
ఆహ్‌ నేనా నీతో సరిపోతానా

నల్లా నల్లాని కళ్ళ పిల్లాడా నువ్వుపెళ్ళాడేది
ఎల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మ
తెల్లారెసరికల్లా నే జిల్లాలన్ని వెతికి దాన్ని
ఎల్లాగోలాగ తెచ్చి పెళ్ళి చేసేస్తానమ్మా

చరణం 2:

మెత్తంగా పువ్వులా ఉంటే చాలా
మొత్తంగా తానే చేసుకు పోతుండాలా
కులుకుల్లో స్వర్గం చేతికి అందించాలా
సై అంటే సై అని బరిలో దూకెయ్యాలా
కాళ్ళా గజ్జ కంకాళమ్మా ఎవరోయమ్మ కజురహో బొమ్మా

ఇంకెందుకులే దాపరికమ్మ నచ్చిన పిల్లవు నువ్వేనమ్మా

ఛీ నేనా నీతో సరిపోతానా

సిగ్గుల మొగ్గల బూరెల బుగ్గల
నల్లా నల్లాని కళ్ళ పిల్లా నిను పెళ్ళాడే వాడ్నిలా
ఊరించి ఉడికించొద్దమ్మ
తెల్లారెసరికల్లా మనమెల్లాగోలాగ
మొగుడుపెళ్ళాలై పోయేదారి కాస్త చూపించేయమ్మ

pallavi:

nallā nallāni kaḽḽa pillā nī mŏguḍayye
vāḍĕllā uṁḍāli kŏṁchĕṁ sĕppammā
tĕllāresarigallā ne jillālanni vĕdigi vāṇṇĕllāgolāga
tĕchchi pĕḽḽi sesestānammā

saraṇaṁ 1:

ĕrraṁgā bŏddugā uṁṭe sālā
vŏḽḽobĕṭṭugu lāli pāḍi jogŏṭṭālā
aḍugulage maḍugulu ŏtte vāḍe melā
mīsaṁ mīda nimmagāyalu nilabĕṭṭālā
uppula guppā vayyāri bhāmā
muddula gumma sĕppavĕ bŏmmā

uppula guppagi vayyāri bhāmagi
nachchina mŏguḍivi nuvvenammā
āh‌ nenā nīdo saribodānā

nallā nallāni kaḽḽa pillāḍā nuvvubĕḽḽāḍedi
ĕllā uṁḍāli kŏṁchĕṁ sĕppamma
tĕllārĕsarigallā ne jillālanni vĕdigi dānni
ĕllāgolāga tĕchchi pĕḽḽi sesestānammā

saraṇaṁ 2:

mĕttaṁgā puvvulā uṁṭe sālā
mŏttaṁgā tāne sesugu poduṁḍālā
kulugullo svargaṁ sedigi aṁdiṁchālā
sai aṁṭe sai ani barilo dūgĕyyālā
kāḽḽā gajja kaṁkāḽammā ĕvaroyamma kajuraho bŏmmā

iṁkĕṁdugule dābarigamma nachchina pillavu nuvvenammā

shī nenā nīdo saribodānā

siggula mŏggala būrĕla buggala
nallā nallāni kaḽḽa pillā ninu pĕḽḽāḍe vāḍnilā
ūriṁchi uḍigiṁchŏddamma
tĕllārĕsarigallā manamĕllāgolāga
mŏguḍubĕḽḽālai poyedāri kāsta sūbiṁcheyamma