Nadireyi e jaamulo

నడిరేయి ఏ జాములో
Year
Language

పల్లవి:

నడిరేయి ఏ జాములో
స్వామి నిను చేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునూ...

నడిరేయి ఏ జాములో
స్వామి నిను చేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునూ

చరణం 1:

మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ
మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ

పతి దేవు ఒడిలోన మురిసేటివేళా
స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటివేళా
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా

చరణం 2:

ఏడెడు శిఖరాలు నే నడువలేను ..ఏ పాటి కానుక లందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేను...నేను వివరించి నా బాధ వినిపించలేను

అమ్మా..ఆ..ఆ..ఆ మము గన్న మాయమ్మా అలివేలుమంగా
మము గన్న మాయమ్మా అలివేలుమంగా
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా

చరణం 3:

కలవారినేగాని కరుణించలేడా నిరుపేద మొరలేవి వినిపించుకోడా
కన్నీటి బ్రతుకుల కనలేనినాడు స్వామి కరుణామయుండన్నా బిరుదేలనమ్మా
అడగవే మా తల్లి అనురాగ వల్లి ..అడగవె మాయమ్మ అలివేలుమంగా !

నడిరేయి ఏ జాములో
స్వామి నిను చేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునూ...

pallavi:

naḍireyi e jāmulo
svāmi ninu sera digivachchuno
tirumala śhikharālu digivachchunū...

naḍireyi e jāmulo
svāmi ninu sera digivachchuno
tirumala śhikharālu digivachchunū

saraṇaṁ 1:

mamuganna māyamma alivelu maṁgamma
mamuganna māyamma alivelu maṁgamma

padi devu ŏḍilona muriseḍiveḽā
svāmi sirunavvu vĕnnĕlalu kuriseḍiveḽā
vibhunigi mā māḍa vinibiṁchavammā
prabhuvugu mā manavi vinibiṁchavammā

saraṇaṁ 2:

eḍĕḍu śhikharālu ne naḍuvalenu ..e pāḍi kānuga laṁdiṁchalenu
vĕṁkanna pādālu darśhiṁchalenu...nenu vivariṁchi nā bādha vinibiṁchalenu

ammā..ā..ā..ā mamu ganna māyammā alivelumaṁgā
mamu ganna māyammā alivelumaṁgā
vibhunigi mā māḍa vinibiṁchavammā
prabhuvugu mā manavi vinibiṁchavammā

saraṇaṁ 3:

kalavārinegāni karuṇiṁchaleḍā nirubeda mŏralevi vinibiṁchugoḍā
kannīḍi bradugula kanalenināḍu svāmi karuṇāmayuṁḍannā birudelanammā
aḍagave mā talli anurāga valli ..aḍagavĕ māyamma alivelumaṁgā !

naḍireyi e jāmulo
svāmi ninu sera digivachchuno
tirumala śhikharālu digivachchunū...