నాలోని స్వప్నాలా అందాలే నీవు
పల్లవి:
నాలోని స్వప్నాలా అందాలే నీవు
నా కోసమేనా దిగి వచ్చినావు
నాలోని స్వప్నాలా అందానివే నీవు
నా కోసమేనా దిగి వచ్చినావు
చరణం 1:
తెల్లని జాబిల్లి తలపే నీవు
చల్లని గాలిలో తనువే నీవు
మాటవు నీవైన భావమే నేను
మాటవు నీవైన భావమే నేను
పాటవు నీవైన రాగమే నేను
పాటవు నీవైన రాగమే నేను
మనలో వలపే వరమై వెలసే
నాలోని స్వప్నాలా అందాలే నీవు
నా కోసమేనా దిగి వచ్చినావు
చరణం 2:
రెప్పలు రెండైన కన్నొకటేగా
కన్నులు రెండైన చూపొకటేగా
పెదవులు రెండైన పదమొకటేగా
పెదవులు రెండైన పదమొకటేగా
మేనులు రెండైన మనసొకటేగా
మేనులు రెండైన మనసొకటేగా
మనలో వలపే వరమై వెలసే
నాలోని స్వప్నాలా అందాలే నీవు
నా కోసమేనా దిగి వచ్చినావు
pallavi:
nāloni svapnālā aṁdāle nīvu
nā kosamenā digi vachchināvu
nāloni svapnālā aṁdānive nīvu
nā kosamenā digi vachchināvu
saraṇaṁ 1:
tĕllani jābilli talabe nīvu
sallani gālilo tanuve nīvu
māḍavu nīvaina bhāvame nenu
māḍavu nīvaina bhāvame nenu
pāḍavu nīvaina rāgame nenu
pāḍavu nīvaina rāgame nenu
manalo valabe varamai vĕlase
nāloni svapnālā aṁdāle nīvu
nā kosamenā digi vachchināvu
saraṇaṁ 2:
rĕppalu rĕṁḍaina kannŏgaḍegā
kannulu rĕṁḍaina sūbŏgaḍegā
pĕdavulu rĕṁḍaina padamŏgaḍegā
pĕdavulu rĕṁḍaina padamŏgaḍegā
menulu rĕṁḍaina manasŏgaḍegā
menulu rĕṁḍaina manasŏgaḍegā
manalo valabe varamai vĕlase
nāloni svapnālā aṁdāle nīvu
nā kosamenā digi vachchināvu