పల్లవి:
నాలో నేను లేనే లేను
ఎపుడో నేనూ నువ్వయ్యానూ
అడగకముందే అందిన వరమా
అలజడి పెంచే తొలి కలవరమా
ప్రేమా ప్రేమా యిది నీ మహిమ
ప్రేమా ప్రేమా యిది నీ మహిమ
చరణం 1:
మొన్నా నిన్నా తెలియదె అసలూ
మొన్నా నిన్నా తెలియదె అసలూ
మదిలోన మొదలైన ఈ గుసగుసలు
ఏం తోచనీకుంది తీయని దిగులు
రమ్మని పిలిచే కోయిల స్వరమా
కమ్మని కలలే కోరిన వరమా
ఎందాక సాగాలి ఈ పయనాలు
ఏ చోట ఆగాలి నా పాదాలు
చరణం 2:
ఎన్నో విన్నా జంటల కథలు
ఎన్నో విన్నా జంటల కథలు
నను తాకనే లేదు ఆ మధురిమలూ
కదిలించనే లేదూ కలలూ అలలూ
గతజన్మలో తీరని ఋణమా
నా జంటగా చేరిన ప్రేమా
నా ప్రాణమే నిన్ను పిలిచిందేమో
నా శ్వాసతో నిన్ను పెంచిందేమో
pallavi:
nālo nenu lene lenu
ĕbuḍo nenū nuvvayyānū
aḍagagamuṁde aṁdina varamā
alajaḍi pĕṁche tŏli kalavaramā
premā premā yidi nī mahima
premā premā yidi nī mahima
saraṇaṁ 1:
mŏnnā ninnā tĕliyadĕ asalū
mŏnnā ninnā tĕliyadĕ asalū
madilona mŏdalaina ī gusagusalu
eṁ tosanīguṁdi tīyani digulu
rammani pilise koyila svaramā
kammani kalale korina varamā
ĕṁdāga sāgāli ī payanālu
e soḍa āgāli nā pādālu
saraṇaṁ 2:
ĕnno vinnā jaṁṭala kathalu
ĕnno vinnā jaṁṭala kathalu
nanu tāgane ledu ā madhurimalū
kadiliṁchane ledū kalalū alalū
gadajanmalo tīrani ṛṇamā
nā jaṁṭagā serina premā
nā prāṇame ninnu pilisiṁdemo
nā śhvāsado ninnu pĕṁchiṁdemo