Naalo nenenaa edo annaanaa

నాలో నేనేనా ఏదో అన్నానా
Work
Year
Language

పల్లవి:

నాలో నేనేనా.. ఏదో అన్నానా.. నాతో నేలేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో.. విన్న మాటేదో నిన్నడగనా
అలా సాగిపోతున్న నాలోన.. ఇదేంటిలా కొత్త ఆలోచన
మనసే నాది.. మాటే నీది..

ఇదేం మాయో..

నాలో నేనేనా.. ఏదో అన్నానా.. నాతో నేలేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో.. చిన్న మాటేదో నిన్నడగనా

చరణం 1:

అవును కాదు తడబాటునీ.. అంతో ఇంతో గడి దాటనీ
విడి విడి పోనీ పరదాని.. పలుకై రానీ ప్రాణాన్నీ
ఎదంతా పదాల్లోన పలికేనా.. నా మౌనమే ప్రేమ ఆలాపన

మనసే నాది.. మాటే నీది
ఇదేం మాయో..

నాలో నేనేనా.. ఏదో అన్నానా.. నాతో నేలేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో.. చిన్న మాటేదో నిన్నడగనా

చరణం 2:

దైవం వరమై దొరికిందనీ.. నాలో సగమై కలిసిందనీ
మెలకువ కానీ హృదయాన్ని.. చిగురై పోనీ శిశిరాన్ని
నీతో చెలిమి చేస్తున్న నిమిషాలు.. నూరేళ్ళుగా ఎదిగిపోయాయి ఇలా
మనమే సాక్షం.. మాటే మంత్రం
ప్రేమే బంధం..

నాలో నేనేనా.. ఏదో అన్నానా.. నాతో నేలేని మైమరపునా
ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో.. చిన్న మాటేదో నిన్నడగనా

pallavi:

nālo nenenā.. edo annānā.. nādo neleni maimarabunā
emo annānemo nuvvu vinnāvemo.. vinna māḍedo ninnaḍaganā
alā sāgibodunna nālona.. ideṁṭilā kŏtta ālosana
manase nādi.. māḍe nīdi..

ideṁ māyo..

nālo nenenā.. edo annānā.. nādo neleni maimarabunā
emo annānemo nuvvu vinnāvemo.. sinna māḍedo ninnaḍaganā

saraṇaṁ 1:

avunu kādu taḍabāḍunī.. aṁto iṁto gaḍi dāḍanī
viḍi viḍi ponī paradāni.. palugai rānī prāṇānnī
ĕdaṁtā padāllona paligenā.. nā mauname prema ālābana

manase nādi.. māḍe nīdi
ideṁ māyo..

nālo nenenā.. edo annānā.. nādo neleni maimarabunā
emo annānemo nuvvu vinnāvemo.. sinna māḍedo ninnaḍaganā

saraṇaṁ 2:

daivaṁ varamai dŏrigiṁdanī.. nālo sagamai kalisiṁdanī
mĕlaguva kānī hṛdayānni.. sigurai ponī śhiśhirānni
nīdo sĕlimi sestunna nimiṣhālu.. nūreḽḽugā ĕdigiboyāyi ilā
maname sākṣhaṁ.. māḍe maṁtraṁ
preme baṁdhaṁ..

nālo nenenā.. edo annānā.. nādo neleni maimarabunā
emo annānemo nuvvu vinnāvemo.. sinna māḍedo ninnaḍaganā