పల్లవి:
నాగులేటి వాగులోన కడవ ముంచబోతుంటే
నాగులేటి వాగులోన కడవ ముంచబోతుంటే
నీటిలోన నిన్ను చూసి కొంగు జారి పోతుంటే
ఎంతో సిగ్గైందిరా మావ.. ఒళ్ళు జల్లుమన్నాదిరా
మావా.. ఒళ్ళు జల్లు మన్నాదిరా
నాగులేటి వాగులోన కడవ ముంచబోతుంటే
నీటిలోన నిన్ను చూసి కొంగు జారి పోతుంటే
ఎంతో సిగ్గైందిరా మావ.. ఒళ్ళు జల్లుమన్నాదిరా
మావా.. ఒళ్ళు జల్లు మన్నాదిరా
చరణం 1:
గూటిలోన దీపమెట్టి..ఈ.. ఏడినీళ్ళ తానమాడి..ఈ..
గూటిలోన దీపమెట్టి..ఈ.. ఏడినీళ్ళ తానమాడి..ఈ..
బంతి పూలు ఎట్టుకొని.. నీకోసం చూస్తుంటే
బంతి పూలు ఎట్టుకొని.. నీకోసం చూస్తుంటే
చందమామ వచ్చాడు.. కన్ను గీటి పోయాడు
చందమామ వచ్చాడు.. కన్ను గీటి పోయాడు
అప్పుడు మావా.. ఊఁ..
ఎంతో సిగ్గైందిరా.. మావ.. ఒళ్ళు జల్లు మన్నాదిరా
మావా.. ఒళ్ళు జల్లు మన్నాదిరా
చరణం 2:
నల్ల మబ్బు మొలిచింది..ఈ.. పల్లె మీద కురిసింది..ఈ..
నల్ల మబ్బు మొలిచింది..ఈ.. పల్లె మీద కురిసింది..ఈ..
జల్లు కురవబోతుంటే.. ఒళ్ళు మరిచి నేనుంటే..ఓ..ఓ..ఓ..
జల్లు కురవబోతుంటే.. ఒళ్ళు మరిచి నేనుంటే
మబ్బులోన మెరుపొచ్చి.. బుగ్గ గిల్లి పోయింది
మబ్బులోన మెరుపొచ్చి.. బుగ్గ గిల్లిపోయింది
అప్పుడు మావా.. ఆహ్..
ఎంతో సిగ్గైందిరా మావ.. ఒళ్ళు జల్లుమన్నాదిరా
మావా.. ఒళ్ళు జల్లు మన్నాదిరా
నాగులేటి వాగులోన కడవ ముంచబోతుంటే
నీటిలోన నిన్ను చూసి కొంగు జారి పోతుంటే
ఎంతో సిగ్గైందిరా మావ.. ఒళ్ళు జల్లు మన్నాదిరా
మావా.. ఒళ్ళు జల్లు మన్నాదిరా
మావా.. ఒళ్ళు జల్లు మన్నాదిరా
మావా.. ఒళ్ళు జల్లు మన్నాదిరా