పల్లవి:
నాగమల్లి కోనలోన
నక్కింది లేడికూన !!2!!
ఎరవేసి..హ...గురిచూసి...హ
పట్టాలి మామా....
ఎరవేసి గురిచూసి పట్టాలి మామా
పట్టాలి మామా...
చరణం 1:
చూపుల్లో కైపుంది మావా
సొగసైన రూపుంది మావా !!చూపుల్లో!!
వయ్యారం ఒలికిస్తుంది
వన్నెలు చిన్నెలు నేర్చింది
ఓ ఉడుకుమీద ఉరికావంటే
జడుసుకుంటది
దాన్ని ఒడుపుచూసి మచ్చిక చేస్తే
వదలనంటది మావోయ్...
చరణం 2:
నడకల్లో హొయలుంది మావా
నాట్యంలో నేర్పుంది మావా !!నడకల్లో!!
మలిసందె చీకట్లోన
నీటికి ఏటికి వస్తుంది
ఓ జాడ చూసి కాశావంటే దారికొస్తది
దాని జాలి చూపు నమ్మావంటే
దగా చేస్తది మావోయ్