Naa peru seppugomdi meelo evarainaa

నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా
Year
Language

పల్లవి:

నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా...
నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా...

చల్లగాలి.. చందమామ. మల్లెతీగ.. చిలకమ్మ.. మీలో.. ఒకరైనా..
నా పేరు చెప్పుకోండి.. నా పేరు చెప్పుకోండి

చరణం 1:

కవిత.. సరిత.. మమత.. నిఖిత.. రెండు జళ్ళ సీత..
ప్రతిమ.. ఫాతిమ.. మహిమా.. ఉమ.. సత్యభామ..
నీలిమేఘాలతోటి.. ఆడుకుంటాను గాని.. నా పేరు నీలిమ కాదు
అన్ని రాగాలబాణి.. పాడుకుంటాను గాని.. నా పేరు రాగిణి కాదు
బంగారమంటి మనసుంది కాని.. నా పేరు కనకం కాదు
భోగాలు పంచే సొగసుంది కాని.. నా పేరు భాగ్యం కాదు
హొహొహో.. హొహొహో..

ఓటమంటు ఒప్పుకోను.. విజయను కాను..
ఒట్టిమాట చెప్పలేను.. సత్యను కాను
మీ ఊహకే వదిలేస్తున్నాను ఊహను కాను.. కల్పన కాను
నా పేరు.. నా.. నా.. నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా
నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా..

చరణం 2:

చిన్ని చెక్కిళ్ళలోనా.. కొన్ని గులాబిలున్న.. నా పేరు రోజా కాదు
అన్ని పుష్పాలు చేరి.. నను అర్చించుతున్న.. నా పేరు పూజిత కాదు
ఏ కన్ను సోకని కన్యను ఐనా.. నా పేరు సుకన్య కాదు
అమవస చీకటి అంటదు ఎపుడు.. నా పేరు పూర్ణిమ కాదు
హొహొహో.. హొహొహో..

బోలెడంత జాలి ఉంది.. కరుణను కాను
అంతులేని పేరు ఉంది.. కీర్తిని కాను
మీరే మీరే తేల్చాలండి.. మీరా నసలే కానే కాను..
నా పేరు.. నా .. నా .. నా పేరు చెప్పుకోండి.. మీలో ఎవరైనా..
నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా..
చల్లగాలి.. చందమామ.. మల్లెతీగ.. చిలకమ్మ.. మీలో.. ఒకరైనా..
నా పేరు రాణి.. రాణి.. రాణి..
రాణి.. రాణి.. రాణి..

pallavi:

nā peru sĕppugoṁḍi mīlo ĕvarainā...
nā peru sĕppugoṁḍi mīlo ŏgarainā...

sallagāli.. saṁdamāma. mallĕdīga.. silagamma.. mīlo.. ŏgarainā..
nā peru sĕppugoṁḍi.. nā peru sĕppugoṁḍi

saraṇaṁ 1:

kavida.. sarida.. mamada.. nikhida.. rĕṁḍu jaḽḽa sīda..
pradima.. phādima.. mahimā.. uma.. satyabhāma..
nīlimeghāladoḍi.. āḍuguṁṭānu gāni.. nā peru nīlima kādu
anni rāgālabāṇi.. pāḍuguṁṭānu gāni.. nā peru rāgiṇi kādu
baṁgāramaṁṭi manasuṁdi kāni.. nā peru kanagaṁ kādu
bhogālu paṁche sŏgasuṁdi kāni.. nā peru bhāgyaṁ kādu
hŏhŏho.. hŏhŏho..

oḍamaṁṭu ŏppugonu.. vijayanu kānu..
ŏṭṭimāḍa sĕppalenu.. satyanu kānu
mī ūhage vadilestunnānu ūhanu kānu.. kalbana kānu
nā peru.. nā.. nā.. nā peru sĕppugoṁḍi mīlo ĕvarainā
nā peru sĕppugoṁḍi mīlo ŏgarainā..

saraṇaṁ 2:

sinni sĕkkiḽḽalonā.. kŏnni gulābilunna.. nā peru rojā kādu
anni puṣhpālu seri.. nanu arsiṁchudunna.. nā peru pūjida kādu
e kannu sogani kanyanu ainā.. nā peru suganya kādu
amavasa sīgaḍi aṁṭadu ĕbuḍu.. nā peru pūrṇima kādu
hŏhŏho.. hŏhŏho..

bolĕḍaṁta jāli uṁdi.. karuṇanu kānu
aṁtuleni peru uṁdi.. kīrdini kānu
mīre mīre telsālaṁḍi.. mīrā nasale kāne kānu..
nā peru.. nā .. nā .. nā peru sĕppugoṁḍi.. mīlo ĕvarainā..
nā peru sĕppugoṁḍi mīlo ŏgarainā..
sallagāli.. saṁdamāma.. mallĕdīga.. silagamma.. mīlo.. ŏgarainā..
nā peru rāṇi.. rāṇi.. rāṇi..
rāṇi.. rāṇi.. rāṇi..