నా పేరు బికారి నా దారి ఎడారి
పల్లవి:
నా పేరు బికారి నా దారి ఎడారి
మనసైన చోట మజిలీ కాదన్న చాలు బదిలీ
నా దారి ఎడారి నా పేరు బికారి
నా దారి ఎడారి నా పేరు బికారి
చరణం 1:
తోటకు తోబుట్టువును ఏటికి నే బిడ్డను
తోటకు తోబుట్టువును ఏటికి నే బిడ్డను
పాట నాకు సైదోడు పక్షి నాకు తోడు
విసుగు రాదు ఖుషీ పోదు వేసట లేనేలేదు ...
విసుగు రాదు ఖుషీ పోదు వేసట లేనేలేదు .. అసలు నా మరోపేరు ఆనంద విహారి !
చరణం 2:
మేలుకొని కలలుగని మేఘాల మేడపై
మెరుపుతీగలాంటి నా ప్రేయసినూహించుకొని
ఇంద్రధనసు పల్లకీ ఎక్కి కలుసుకోవాలని...ఆ..ఆ..ఆ...
ఇంద్రధనసు పల్లకీ ఎక్కి కలుసుకోవాలని .. ఆకాశవీధిలో పయనించు బాటసారి !
చరణం 3:
కూటికి నే పేదను గుణములలో పెద్దను
కూటికి నే పేదను గుణములలో పెద్దను
సంకల్పం నాకు ధనము సాహసమే నాకు బలం
ఏనాటికో ఈ గరీబు కాకపోడు నవాబు .....
ఏనాటికో ఈ గరీబు కాకపోడు నవాబు ..అంతవరకు నేనొక నిరంతర సంచారి!
pallavi:
nā peru bigāri nā dāri ĕḍāri
manasaina soḍa majilī kādanna sālu badilī
nā dāri ĕḍāri nā peru bigāri
nā dāri ĕḍāri nā peru bigāri
saraṇaṁ 1:
toḍagu tobuṭṭuvunu eḍigi ne biḍḍanu
toḍagu tobuṭṭuvunu eḍigi ne biḍḍanu
pāḍa nāgu saidoḍu pakṣhi nāgu toḍu
visugu rādu khuṣhī podu vesaḍa leneledu ...
visugu rādu khuṣhī podu vesaḍa leneledu .. asalu nā maroberu ānaṁda vihāri !
saraṇaṁ 2:
melugŏni kalalugani meghāla meḍabai
mĕrubudīgalāṁṭi nā preyasinūhiṁchugŏni
iṁdradhanasu pallagī ĕkki kalusugovālani...ā..ā..ā...
iṁdradhanasu pallagī ĕkki kalusugovālani .. āgāśhavīdhilo payaniṁchu bāḍasāri !
saraṇaṁ 3:
kūḍigi ne pedanu guṇamulalo pĕddanu
kūḍigi ne pedanu guṇamulalo pĕddanu
saṁkalbaṁ nāgu dhanamu sāhasame nāgu balaṁ
enāḍigo ī garību kāgaboḍu navābu .....
enāḍigo ī garību kāgaboḍu navābu ..aṁtavaragu nenŏga niraṁtara saṁchāri!