నా మనసుకేమయింది నీ మాయలో పడింది
పల్లవి:
అర్రెర్రె..రెర్రె..రేరే
అర్రెర్రె..రెర్రె..రేరే
నా మనసుకేమయింది నీ మాయలో పడింది
నిజమా కలా తెలిసేదెలా
నాకు అలాగె ఉంది ఎన్నో అనాలనుంది
దాచేదెలా లోలోపలా
మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది
అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది
నా మనసుకేమయింది నీ మాయలో పడింది
నిజమా కలా తెలిసేదెలా...
చరణం 1:
చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ
కొత్తగా ఉంది బొత్తిగా నమ్మలేనంత ఈ వింత ధీమా
జంటగా వెంట నువ్వుంటే అందడా నాకు ఆ చందమామ
అందుకే నాకు నువ్వంటే మాటలో చెప్పలేనంత ప్రేమ
పంచుకున్న ముద్దులో.. ఇలా జతే పడి
పెంచుకున్న మత్తులో.. పడి మతే చెడి
గాలితో చెప్పనీ మన మొదటి గెలుపు ఇదని
నా మనసుకేమయింది నీ మాయలో పడింది
నిజమా కలా తెలిసేదెలా...
చరణం 2:
ఎప్పుడూ గుండె చప్పుడు కొట్టుకుంటుంది నీ పేరు లాగా
ఎప్పుడో అప్పుడప్పుడు గుర్తుకొస్తోంది నా పేరు కొద్దిగా
ఒంటిగా ఉండనివ్వదు కళ్ళలో ఉన్న నీ రూపురేఖ
ఇంతగా నన్ను ఎవ్వరూ కమ్ముకోలేదు నీలా ఇలాగా
లోకమంటె ఇద్దరే అదే మనం అనీ
స్వర్గమంటె ఇక్కడే అంటే సరే అనీ
వెన్నెలే పాడనీ మన చిలిపి చెలిమి కథని
నా మనసుకేమయింది నీ మాయలో పడింది
నిజమా కలా తెలిసేదెలా...
మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది
అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది
pallavi:
arrĕrrĕ..rĕrrĕ..rere
arrĕrrĕ..rĕrrĕ..rere
nā manasugemayiṁdi nī māyalo paḍiṁdi
nijamā kalā tĕlisedĕlā
nāgu alāgĕ uṁdi ĕnno anālanuṁdi
dāsedĕlā lolobalā
mana iddarigi tĕliyaṁdi edo jarige uṁṭuṁdi
aṁduge iṁtalā guṁḍĕ uligi paḍudu uṁdi
nā manasugemayiṁdi nī māyalo paḍiṁdi
nijamā kalā tĕlisedĕlā...
saraṇaṁ 1:
sukkale tĕchchi ivvanā aṁdi nī mīda nāgunna prema
kŏttagā uṁdi bŏttigā nammalenaṁta ī viṁta dhīmā
jaṁṭagā vĕṁṭa nuvvuṁṭe aṁdaḍā nāgu ā saṁdamāma
aṁduge nāgu nuvvaṁṭe māḍalo sĕppalenaṁta prema
paṁchugunna muddulo.. ilā jade paḍi
pĕṁchugunna mattulo.. paḍi made sĕḍi
gālido sĕppanī mana mŏdaḍi gĕlubu idani
nā manasugemayiṁdi nī māyalo paḍiṁdi
nijamā kalā tĕlisedĕlā...
saraṇaṁ 2:
ĕppuḍū guṁḍĕ sappuḍu kŏṭṭuguṁṭuṁdi nī peru lāgā
ĕppuḍo appuḍappuḍu gurdugŏstoṁdi nā peru kŏddigā
ŏṁṭigā uṁḍanivvadu kaḽḽalo unna nī rūburekha
iṁtagā nannu ĕvvarū kammugoledu nīlā ilāgā
logamaṁṭĕ iddare ade manaṁ anī
svargamaṁṭĕ ikkaḍe aṁṭe sare anī
vĕnnĕle pāḍanī mana silibi sĕlimi kathani
nā manasugemayiṁdi nī māyalo paḍiṁdi
nijamā kalā tĕlisedĕlā...
mana iddarigi tĕliyaṁdi edo jarige uṁṭuṁdi
aṁduge iṁtalā guṁḍĕ uligi paḍudu uṁdi