నా మనసే ఒక తెల్లని కాగితం
పల్లవి:
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం
అది ఈనాడైనా ఏనాడైనా
నీకే నీకే అంకితం.. //నా మనసే//
చరణం 1:
తెరచిన నా కన్నులలో ఎపుడు నీ రూపమే
మూసిన నా కన్నులలో ఎపుడు నీ కలల దీపమే (తెరచిన)
కనులే కలలై.. కలలే కనులై (2)
చూసిన అందాలు అనుబంధాలు అవి నీకే నీకే అంకితం
//నా మనసే//
చరణం 2:
నిండిన నా గుండెలలో ఎపుడూ నీ ధ్యానమే
పండిన ఆ ధ్యానంలో ఎపుడూ నీ ప్రణయ గానమే (నిండిన)
ధ్యానమే గానమై.. గానమే ప్రాణమై (2)
పలికిన రాగాలు అనురాగాలు అవి నీకే నీకే అంకితం
//నా మనసే//
pallavi:
nā manase ŏga tĕllani kāgidaṁ
nī valabe tŏli vĕnnĕla saṁtagaṁ
nā manase ŏga tĕllani kāgidaṁ
nī valabe tŏli vĕnnĕla saṁtagaṁ
adi īnāḍainā enāḍainā
nīge nīge aṁkidaṁ.. //nā manase//
saraṇaṁ 1:
tĕrasina nā kannulalo ĕbuḍu nī rūbame
mūsina nā kannulalo ĕbuḍu nī kalala dībame (tĕrasina)
kanule kalalai.. kalale kanulai (2)
sūsina aṁdālu anubaṁdhālu avi nīge nīge aṁkidaṁ
//nā manase//
saraṇaṁ 2:
niṁḍina nā guṁḍĕlalo ĕbuḍū nī dhyāname
paṁḍina ā dhyānaṁlo ĕbuḍū nī praṇaya gāname (niṁḍina)
dhyāname gānamai.. gāname prāṇamai (2)
paligina rāgālu anurāgālu avi nīge nīge aṁkidaṁ
//nā manase//