నా మది నిన్ను పిలిచింది గానమై...
పల్లవి:
ఓ ప్రియతమా... ఓ ప్రియతమా...ప్రియతమా...
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై ||2||
చరణం 1:
ఎవ్వరివో నీవు నే నెరుగలేను
ఏ పేరున నిన్ను నే పిలువగలను ||2||
తలపులలోనే నిలిచేవు నీవే
తొలకరి మెరుపుల రూపమై
చరణం 2:
ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను
ఈ మూగబాధ ఎందాక దాచేను ||2||
వేచిన మదినే వెలిగింప రావే
ఆరని అనురాగ దీపమై
pallavi:
o priyadamā... o priyadamā...priyadamā...
nā madi ninnu pilisiṁdi gānamai
veṇu gānamai nā prāṇamai ||2||
saraṇaṁ 1:
ĕvvarivo nīvu ne nĕrugalenu
e peruna ninnu ne piluvagalanu ||2||
talabulalone nilisevu nīve
tŏlagari mĕrubula rūbamai
saraṇaṁ 2:
ĕnni yugālani nī kŏragu vesenu
ī mūgabādha ĕṁdāga dāsenu ||2||
vesina madine vĕligiṁpa rāve
ārani anurāga dībamai