పల్లవి:
ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా
ఆ ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ...
లాల లరలరలా...
చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను
ఆ చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను
తొందరపడితే లాభం లేదయా...
చరణం 1:
నీ జారుపైటా... ఊఁ?
ఊరిస్తూవుంది... ఊ హూఁ...
నీ కొంటె చూపు... ఛీ...
కొరికేస్తూ ఉందీ...
నీ జారుపైటా... ఊరిస్తూవుంది ..అబ్బా
నీ కొంటె చూపు కొరికేస్తూ ఉంది
కన్నూకన్నూ ఎపుడో కలిసిందీ
ఆ ఆహా ఒహొ హొహో...
అయ్యో! ఏందయ్యా గోలా... ఊఁ...
సిగ్గేమిలేదా?... నాకెందుకూ!...
ఊరోళ్లు ఇంటే ఎగతాళి కాదా ఆ...
ఏందయ్యా గోలా.. చీ చీ.. సిగ్గేమిలేదా?.. పోదు బడాయి ॥
ఊరోళ్లు ఇంటే ఎగతాళి కాదా ఆ...
నిన్నూ నన్నూ చూస్తే నామరదా
ఆహా ఓహోహో ఊహుహు
ఆ ముత్యాలు ..ఆ ..వస్తావా ..ఊ
అడిగింది.. అబ్బో ..ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ...
చరణం 2:
పర్మినెంటుగానూ... ఆఁ!
నిన్ను చేసుకుంటానూ... అబ్బో!!
ఉన్నదంతా ఇచ్చేసి... అయ్యో...
నిన్ను చూసుకుంటాను
ఇంటా బైటా పట్టుకునుంటాను
హోహో... హు...
ఆహాహా... ఏహేహేహే...
ఏరుదాటి పొయ్యాకా
తెప్ప తగలయేస్తేనూ
అమ్మామ్మామ్మా...
ఊరంతా తెలిశాక ఒదిలి పెట్టిపోతేనూ
బండ కేసి నిను బాదేస్తానయ్యా
హోహో ఓహోహో ఆహాహాహా
రేవులోన నిను ముంచేస్తానయ్యో
హో ఆహాహా ఊహో ఓహ్
ఆ ముత్యాలు ..ఆ ..వస్తావా ..ఊ
అడిగింది.. అయ్యో ..ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ... హీ హీ హీ ...
చలమయ్యా ..ఆ ..వస్తాను ..అబ్బో.. ఆ పైన చూస్తాను.. అయ్యో
తొందరపడితే లాభం లేదయా... డా డా డా డ ....