ముసుగు వెయ్యొద్దు మనసు మీద
పల్లవి:
ముసుగు వెయ్యొద్దు మనసు మీద
వలలు వెయ్యొద్దు వయసు మీద
హేయ్...ముసుగు వెయ్యొద్దు మనసు మీద
వలలు వెయ్యొద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతో
ఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరా
అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా
మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వారే లేరురా
మనకు తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఏంటిరా
ముసుగు వెయ్యొద్దు మనసు మీద
వలలు వెయ్యొద్దు వయసు మీద...
చరణం 1:
సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపుని
చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దని
తిరిగిపడదా కప్పగలరా ఉరకలేస్తున్న ఆశని
దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని
ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళముందుండగా
అందుకోకుండ ఆగిపోతూ ఉసూరుమంటే ఎలా
ఏ ఉడుకు ఏ దుడుకు ఈ వెన్నక్కి తిరగని పరుగు
ఉండదుగా కడవరకు ఈ వయస్సునిలాగే కరిగిపోనీకు...
ముసుగు వెయ్యొద్దు మనసు మీద...
వలలు వెయ్యొద్దు వయసు మీద....
హేయ్...ముసుగు వెయ్యొద్దు మనసు మీద
వలలు వెయ్యొద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తూఫాను వేగాలతో...
చరణం 2:
కొంత కాలం నేలకొచ్చాం అతిధులై ఉండి వెల్లగ
కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా
కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా
అంతకన్నా సొంతమంటూ ప్రపంచపటంలో లేదుగా
నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించనీ
ఉన్నకొన్నాళ్ళు గుండె నిండా సరదాలు పండించనీ
నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసి నడిచాం
సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుదాం...
ముసుగు వెయ్యొద్దు మనసు మీద...
వలలు వెయ్యొద్దు వయసు మీద....
..
pallavi:
musugu vĕyyŏddu manasu mīda
valalu vĕyyŏddu vayasu mīda
hey...musugu vĕyyŏddu manasu mīda
valalu vĕyyŏddu vayasu mīda
ĕgaranivvāli kurrāḽḽa rĕkkalni tūphānu vegālado
ĕvari ānaṁdaṁ vāridaṁṭe ŏppugolerā
anubhaviṁchaṁde tĕliyadaṁṭe tappu aṁṭārā
manasu sĕppiṁde managu vedaṁ kādane vāre lerurā
managu tosiṁde sesi sūddāṁ ĕvaru emaṁṭe eṁṭirā
musugu vĕyyŏddu manasu mīda
valalu vĕyyŏddu vayasu mīda...
saraṇaṁ 1:
sūryuḍainā sūbagalaḍā reyi sāḍunna rebuni
sīgaḍainā ābagaladā vachche kalalni vaddani
tirigibaḍadā kappagalarā uragalestunna āśhani
devuḍainā sĕppagalaḍā samasyalanevi rāvani
ĕnno aṁdālu svāgadistū kaḽḽamuṁduṁḍagā
aṁdugoguṁḍa āgibodū usūrumaṁṭe ĕlā
e uḍugu e duḍugu ī vĕnnakki tiragani parugu
uṁḍadugā kaḍavaragu ī vayassunilāge karigibonīgu...
musugu vĕyyŏddu manasu mīda...
valalu vĕyyŏddu vayasu mīda....
hey...musugu vĕyyŏddu manasu mīda
valalu vĕyyŏddu vayasu mīda
ĕgaranivvāli kurrāḽḽa rĕkkalni tūphānu vegālado...
saraṇaṁ 2:
kŏṁta kālaṁ nelagŏchchāṁ adidhulai uṁḍi vĕllaga
koḍalainā kŏṁpalainā evī sthirāsthi kādugā
kāsta snehaṁ kāsta sahanaṁ paṁchugovachchu hāyigā
aṁtagannā sŏṁtamaṁṭū prabaṁchabaḍaṁlo ledugā
ninnalemainā gurdugŏste tībi anibiṁchanī
unnagŏnnāḽḽu guṁḍĕ niṁḍā saradālu paṁḍiṁchanī
nuvvĕvaro nenĕvaro ī kṣhaṇāna kalisi naḍisāṁ
sāvāsaṁ saṁtoṣhaṁ ivi aṁdiṁchi aṁdarilo navvu niṁpudāṁ...
musugu vĕyyŏddu manasu mīda...
valalu vĕyyŏddu vayasu mīda....
..