Mumdarunna sinna daani amdamemo

ముందరున్న చిన్న దాని అందమేమో
Year
Language

పల్లవి:

ముందరున్న చిన్నదాని అందమేమో...
చందమామ సిగ్గు చెంది సాగిపోయే... దాగిపోయే...
ముందరున్న చిన్నదాని అందమేమో...
చందమామ సిగ్గు చెంది సాగిపోయే... దాగిపోయే...

పొందుగోరు చిన్నవాని తొందరేమో...
మూడుముళ్ళ మాట కూడ మరచిపోయే... తోచదాయే

చరణం 1:

పాల బుగ్గ పిలిచింది ఎందుకోసమో..ఎందుకోసమో
పైట కొంగు కులికింది ఎవరికోసమో..ఎవరికోసమో...
నీలోని పొంగులు నావేనని....
నీలోని పొంగులు నావేనని...చెమరించు నీ మేను తెలిపెలే
ఆ...ఆ..ఓ..ఓ...
పొందుగొరు చిన్నవాని తొందరేమో...
మూడు ముళ్ళ మాట కూడ మరచిపోయే... తోచదాయే

చరణం 2:

కొంటే చూపు రమ్మంది ఎందుకోసమో..ఎందుకోసమో
కన్నెమనసు కాదంది ఎందుకోసమో...ఎందుకోసమో
సరియైన సమయం రాలేదులే....
సరియైన సమయం రాలేదులే....మనువైన తొలిరేయి మనదిలే
ఓ..ఓ..ఆ..ఆ...
ముందరున్న చిన్నదాని అందమేమో..
చందమామ సిగ్గు చెంది సాగిపోయే... దాగిపోయే

చరణం 3:

ఎన్నాళ్ళు మనకీ దూరాలు...ఏనాడు తీరు ఈ విరహాలు
ఎన్నాళ్ళు మనకీ దూరాలు...ఏనాడు తీరు ఈ విరహాలు
కాదన్న వారు అవునన్ననాడు...కౌగిళ్ళ కరిగేది నిజములే

ముందరున్న చిన్నదాని అందమేమో...
చందమామ సిగ్గు చెంది సాగిపోయే ...దాగిపోయే
పొందుగోరు చిన్నవాని తొందరేమో...
మూడుముళ్ళ మాటకూడ మరచిపోయే... తోచదాయే

pallavi:

muṁdarunna sinnadāni aṁdamemo...
saṁdamāma siggu sĕṁdi sāgiboye... dāgiboye...
muṁdarunna sinnadāni aṁdamemo...
saṁdamāma siggu sĕṁdi sāgiboye... dāgiboye...

pŏṁdugoru sinnavāni tŏṁdaremo...
mūḍumuḽḽa māḍa kūḍa marasiboye... tosadāye

saraṇaṁ 1:

pāla bugga pilisiṁdi ĕṁdugosamo..ĕṁdugosamo
paiḍa kŏṁgu kuligiṁdi ĕvarigosamo..ĕvarigosamo...
nīloni pŏṁgulu nāvenani....
nīloni pŏṁgulu nāvenani...sĕmariṁchu nī menu tĕlibĕle
ā...ā..o..o...
pŏṁdugŏru sinnavāni tŏṁdaremo...
mūḍu muḽḽa māḍa kūḍa marasiboye... tosadāye

saraṇaṁ 2:

kŏṁṭe sūbu rammaṁdi ĕṁdugosamo..ĕṁdugosamo
kannĕmanasu kādaṁdi ĕṁdugosamo...ĕṁdugosamo
sariyaina samayaṁ rāledule....
sariyaina samayaṁ rāledule....manuvaina tŏlireyi manadile
o..o..ā..ā...
muṁdarunna sinnadāni aṁdamemo..
saṁdamāma siggu sĕṁdi sāgiboye... dāgiboye

saraṇaṁ 3:

ĕnnāḽḽu managī dūrālu...enāḍu tīru ī virahālu
ĕnnāḽḽu managī dūrālu...enāḍu tīru ī virahālu
kādanna vāru avunannanāḍu...kaugiḽḽa karigedi nijamule

muṁdarunna sinnadāni aṁdamemo...
saṁdamāma siggu sĕṁdi sāgiboye ...dāgiboye
pŏṁdugoru sinnavāni tŏṁdaremo...
mūḍumuḽḽa māḍagūḍa marasiboye... tosadāye