Muddula maa baabu niddarodunnaadu

ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు
Year
Language

పల్లవి:

ష్.. ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు...ష్..
సద్దు చేసారంటె వులికులికి పడతాడు..
ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు...
సద్దు చేసారంటె వులికులికి పడతాడు..
గోపాల కృష్ణయ్య రేపల్లెకు వెలుగు...
గోపాల కృష్ణయ్య రేపల్లెకు వెలుగు
మా చిన్ని కన్నయ్య లోకానికె వెలుగు... జుజుజుజుజు..జుజుజుజుజు..

ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు...ష్..
సద్దు చేసారంటె వులికులికి పడతాడు..

చరణం 1:

చల్లగా నిదరోయే బాబు.. నిదురలో మెల్లగా నవ్వుకునే బాబు..
చల్లగా నిదరోయే బాబు.. నిదురలో మెల్లగా నవ్వుకునే బాబు...
ఏమి కలలు కంటున్నాడో తెలుసా...తెలుసా...
ఏ జన్మకు ఈ తల్లే కావాలనీ...
ఏ జన్మకు ఈ తల్లే కావాలనీ...
ఈ ఒడిలోనె ఆదమరచి వుండాలనీ... జుజుజుజుజు.. జుజుజుజుజు...

ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు...ష్..
సద్దు చేసారంటె వులికులికి పడతాడు..

చరణం 2:

ఓ..ఓ..ఓ..ఓ..
దేవుడే నా ఎదురుగ నిలబడితే...ఏమి కావాలి తల్లీ..అని అడిగితే...
దేవుడే నా ఎదురుగ నిలబడితే...ఏమి కావాలి తల్లీ..అని అడిగితే...
నేనేమని అంటానో తెలుసా...తెలుసా...
నీ నీడలో నా వాడు పెరగాలనీ...
నీ నీడలో నా వాడు పెరగాలనీ...
పెరిగి నీలాగే పేరు తెచ్చుకోవాలని...జుజుజుజుజు.. జుజుజుజుజు...

pallavi:

ṣh.. muddula mā bābu niddarodunnāḍu...ṣh..
saddu sesāraṁṭĕ vuliguligi paḍadāḍu..
muddula mā bābu niddarodunnāḍu...
saddu sesāraṁṭĕ vuliguligi paḍadāḍu..
gobāla kṛṣhṇayya reballĕgu vĕlugu...
gobāla kṛṣhṇayya reballĕgu vĕlugu
mā sinni kannayya logānigĕ vĕlugu... jujujujuju..jujujujuju..

muddula mā bābu niddarodunnāḍu...ṣh..
saddu sesāraṁṭĕ vuliguligi paḍadāḍu..

saraṇaṁ 1:

sallagā nidaroye bābu.. niduralo mĕllagā navvugune bābu..
sallagā nidaroye bābu.. niduralo mĕllagā navvugune bābu...
emi kalalu kaṁṭunnāḍo tĕlusā...tĕlusā...
e janmagu ī talle kāvālanī...
e janmagu ī talle kāvālanī...
ī ŏḍilonĕ ādamarasi vuṁḍālanī... jujujujuju.. jujujujuju...

muddula mā bābu niddarodunnāḍu...ṣh..
saddu sesāraṁṭĕ vuliguligi paḍadāḍu..

saraṇaṁ 2:

o..o..o..o..
devuḍe nā ĕduruga nilabaḍide...emi kāvāli tallī..ani aḍigide...
devuḍe nā ĕduruga nilabaḍide...emi kāvāli tallī..ani aḍigide...
nenemani aṁṭāno tĕlusā...tĕlusā...
nī nīḍalo nā vāḍu pĕragālanī...
nī nīḍalo nā vāḍu pĕragālanī...
pĕrigi nīlāge peru tĕchchugovālani...jujujujuju.. jujujujuju...