Title (Indic)ఒంటరైన గుండెలో తీగలేని వీణలు WorkMounam Year1995 LanguageTelugu Credits Role Artist Music M.M. Keeravani LyricsTeluguపల్లవి: ఒంటరైన గుండెలో తీగలేని వీణలు మోగుతున్న మూగ రాగమేమో నిద్రలేని నిన్నని మేలుకోని రేపుని చూపుతున్న నేటి రాతిరేమో సుదూర తీరాల జ్ఞాపకాలే .. సమీపమౌతున్న జాడలా ఉండుండి వీచేటి ఈ గాలిలో .. ఒంటరైన గుండెలో తీగలేని వీణలు ..మోగుతున్న మూగ రాగమేమో నిద్రలేని నిన్నని మేలుకోని రేపుని ..చూపుతున్న నేటి రాతిరేమో చరణం 1: కంటి చాటు సాగరాలు ఇంతకాలమేడ దాగెనో .. అనురాగ సంగమం ఈ క్షణమే రెప్పదాటు ఉప్పు నీట చెప్పలేని తీపి ఏమిటో .. కరిగించు ఈ క్షణం అమృతమే సుమాలు తుంచిన గతాల మంచునే .. క్షమించి చేరువైన తేనె జల్లిది చినుకు వంతెనెంత చేరుకుంది నీలి నింగి నేలకి చిగురు తొడుగు తడిని తెలపదా.. ఏడేడు జన్మాల స్నేహాలతో ... !! చరణం 2: వేడి శ్వాస వేణువైన నాడిలోని నాదమేవిటో .. తెలవారు వేళకై స్వాగతమే ఉడికించు ఆశలోన భాషలేని భావమేవిటో .. ఒడి చేరు ఊసులో సంబరమే తనంత తానుగా వసంత వాకిట .. ఎడారి దారి చేరి పూల పూయగా కలల కోకిలమ్మ పాడుతోంది మనసు మావితోటలో చెలిమి చిలుకు చైత్ర గీతికా.. తియ్యంగా తేనీటి దాహాలతో....!!! Englishpallavi: ŏṁṭaraina guṁḍĕlo tīgaleni vīṇalu mogudunna mūga rāgamemo nidraleni ninnani melugoni rebuni sūbudunna neḍi rādiremo sudūra tīrāla jñābagāle .. samībamaudunna jāḍalā uṁḍuṁḍi vīseḍi ī gālilo .. ŏṁṭaraina guṁḍĕlo tīgaleni vīṇalu ..mogudunna mūga rāgamemo nidraleni ninnani melugoni rebuni ..sūbudunna neḍi rādiremo saraṇaṁ 1: kaṁṭi sāḍu sāgarālu iṁtagālameḍa dāgĕno .. anurāga saṁgamaṁ ī kṣhaṇame rĕppadāḍu uppu nīḍa sĕppaleni tībi emiḍo .. karigiṁchu ī kṣhaṇaṁ amṛtame sumālu tuṁchina gadāla maṁchune .. kṣhamiṁchi seruvaina tenĕ jallidi sinugu vaṁtĕnĕṁta seruguṁdi nīli niṁgi nelagi siguru tŏḍugu taḍini tĕlabadā.. eḍeḍu janmāla snehālado ... !! saraṇaṁ 2: veḍi śhvāsa veṇuvaina nāḍiloni nādameviḍo .. tĕlavāru veḽagai svāgadame uḍigiṁchu āśhalona bhāṣhaleni bhāvameviḍo .. ŏḍi seru ūsulo saṁbarame tanaṁta tānugā vasaṁta vāgiḍa .. ĕḍāri dāri seri pūla pūyagā kalala kogilamma pāḍudoṁdi manasu māvidoḍalo sĕlimi silugu saitra gīdigā.. tiyyaṁgā tenīḍi dāhālado....!!!