Moradodu naa mogudu

మొరటోడు నా మొగుడు
Work
Year
Language

పల్లవి:

మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు
మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి
ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు
డడడడ డడడడ డడడడడా

మొరటోడు నామొగుడు మోజుపడి తెచ్చాడు
మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి
ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు

చరణం 1:

తెచ్చానే మల్లెదండా...తురిమానే జడ నిండా
చూసుకోవె నా వలపు వాడకుండా...

నా మనసే నిండుకుండా...అది ఉంటుంది తొణక్కుండా
నీ వలపే దానికి అండదండ...
డడడడ డడడడ డడడడడా

మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు...మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి..ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు

చరణం 2:

నిగనిగలా నీకళ్ళు నిలువెత్తు అద్దాలు...నిలబడి చూసుకుంటానందాలూ
నిగనిగలా నీకళ్ళు నిలువెత్తు అద్దాలు...నిలబడి చూసుకుంటానందాలూ
విల్లంటి కనుబొమలు విసిరేను బాణాలు...విరిగిపోవునేమొ నీ అద్దాలు
డడడడ డడడడ డడడడడా

మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు...మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి..ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు

చరణం 3:

తమలపాకు పాదాలూ తాళలేవె కడియాలూ..దిద్దుతానె ముద్దులతో పారాణులూ
నీ ముద్దులే మువ్వలు ఆ మోతలె నా నవ్వులూ..ఆ పారాణికి వస్తాయి ప్రాణాలూ
డడడడ డడడడ డడడడడా

మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు...మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి..ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు

డడడడ డడడడ డడడడడా

pallavi:

mŏraḍoḍu nā mŏguḍu mojubaḍi tĕchchāḍu
muvvannĕ jarīsīra innāḽḽagu
jagamŏṁḍi nā pĕḽḽāṁ muvvannĕ sīragaṭṭi
muddŏstū unnadī nā kaḽḽagu
ḍaḍaḍaḍa ḍaḍaḍaḍa ḍaḍaḍaḍaḍā

mŏraḍoḍu nāmŏguḍu mojubaḍi tĕchchāḍu
muvvannĕ jarīsīra innāḽḽagu
jagamŏṁḍi nā pĕḽḽāṁ muvvannĕ sīragaṭṭi
muddŏstū unnadī nā kaḽḽagu

saraṇaṁ 1:

tĕchchāne mallĕdaṁḍā...turimāne jaḍa niṁḍā
sūsugovĕ nā valabu vāḍaguṁḍā...

nā manase niṁḍuguṁḍā...adi uṁṭuṁdi tŏṇakkuṁḍā
nī valabe dānigi aṁḍadaṁḍa...
ḍaḍaḍaḍa ḍaḍaḍaḍa ḍaḍaḍaḍaḍā

mŏraḍoḍu nā mŏguḍu mojubaḍi tĕchchāḍu...muvvannĕ jarīsīra innāḽḽagu
jagamŏṁḍi nā pĕḽḽāṁ muvvannĕ sīragaṭṭi..muddŏstū unnadī nā kaḽḽagu

saraṇaṁ 2:

niganigalā nīgaḽḽu niluvĕttu addālu...nilabaḍi sūsuguṁṭānaṁdālū
niganigalā nīgaḽḽu niluvĕttu addālu...nilabaḍi sūsuguṁṭānaṁdālū
villaṁṭi kanubŏmalu visirenu bāṇālu...virigibovunemŏ nī addālu
ḍaḍaḍaḍa ḍaḍaḍaḍa ḍaḍaḍaḍaḍā

mŏraḍoḍu nā mŏguḍu mojubaḍi tĕchchāḍu...muvvannĕ jarīsīra innāḽḽagu
jagamŏṁḍi nā pĕḽḽāṁ muvvannĕ sīragaṭṭi..muddŏstū unnadī nā kaḽḽagu

saraṇaṁ 3:

tamalabāgu pādālū tāḽalevĕ kaḍiyālū..diddudānĕ muddulado pārāṇulū
nī muddule muvvalu ā modalĕ nā navvulū..ā pārāṇigi vastāyi prāṇālū
ḍaḍaḍaḍa ḍaḍaḍaḍa ḍaḍaḍaḍaḍā

mŏraḍoḍu nā mŏguḍu mojubaḍi tĕchchāḍu...muvvannĕ jarīsīra innāḽḽagu
jagamŏṁḍi nā pĕḽḽāṁ muvvannĕ sīragaṭṭi..muddŏstū unnadī nā kaḽḽagu

ḍaḍaḍaḍa ḍaḍaḍaḍa ḍaḍaḍaḍaḍā