Mogimdi jegamta mamche jarigenamta

మోగింది జేగంట మంచే జరిగేనంట
Work
Year
Language

పల్లవి:

తననాన నానాన తననాన నానాన
తననాన నానాన తననాన నానాన

మోగింది జేగంట మంచే జరిగేనంట
మనసంటోంది ఈ మాట
కొలిచే దైవాలంతా దీవించారనుకుంటా
నను పిలిచినది పూబాట...తనతోపాటే వెళిపోతా
ఆకాశం నీడంతా నాదేనంటోంది
అలలు ఎగసే ఆశ
ఏ చింతా కాసింత లేనే లేదంది
కలత మరిచే శ్వాస....

మోగింది జేగంట మంచే జరిగేనంట
మనసంటోంది ఈ మాట...మనసంటోంది ఈ మాట

చరణం 1:

పద పదమని నది నడకనీ ఇటు నడిపినదెవరైనా
తన పరుగులో తెలినురగలో నను నేనే చూస్తున్నా
ప్రతి పిలుపునీ కథ మలుపనీ మలి అడుగలు వేస్తున్నా
అలుపెరుగనీ పసి మనసునై సమయంతో వెళుతున్నా
నలుసంత కూడా నలుపేది లేని
వెలుగుంది నేడు నా చూపునా...

ఏ దూరమో ఏ తీరమో ప్రశ్నించనీ పయనంలోన
ఈ దారితో సహవాసమై కొనసాగనా ఏదేమైనా....
మోగింది జేగంట మంచే జరిగేనంట
మనసంటోంది ఈ మాట...మనసంటోంది ఈ మాట

చరణం 2:

ఒక చలువన ఒక వెలుగుగా జత కలసినదో సాయం
మనసెరిగిన మధుమాసమై నను చేర్చిందే గమ్యం
కల నిలువని కనుపాపలో కళలొలికినదో ఉదయం
అది మొదలున నను ముసిరిన ఏకాంతం మటుమాయం
నా చుట్టూ అందంగా మారిందీ లోకం...
ఊహల్లో నైనా లేదీ నిజం...

చిరునవ్వుతో ఈ పరిచయం వరమయ్యిలా నను చేరేనా..
బదులడగని ఈ పరిమళం నా జన్మనే మురుపించేనా...
మోగింది జేగంట మంచే జరిగేనంట
మనసంటోంది ఈ మాట...ఓ...మనసంటోంది ఈ మాట

pallavi:

tananāna nānāna tananāna nānāna
tananāna nānāna tananāna nānāna

mogiṁdi jegaṁṭa maṁche jarigenaṁṭa
manasaṁṭoṁdi ī māḍa
kŏlise daivālaṁtā dīviṁchāranuguṁṭā
nanu pilisinadi pūbāḍa...tanadobāḍe vĕḽibodā
āgāśhaṁ nīḍaṁtā nādenaṁṭoṁdi
alalu ĕgase āśha
e siṁtā kāsiṁta lene ledaṁdi
kalada marise śhvāsa....

mogiṁdi jegaṁṭa maṁche jarigenaṁṭa
manasaṁṭoṁdi ī māḍa...manasaṁṭoṁdi ī māḍa

saraṇaṁ 1:

pada padamani nadi naḍaganī iḍu naḍibinadĕvarainā
tana parugulo tĕlinuragalo nanu nene sūstunnā
pradi pilubunī katha malubanī mali aḍugalu vestunnā
alubĕruganī pasi manasunai samayaṁto vĕḽudunnā
nalusaṁta kūḍā nalubedi leni
vĕluguṁdi neḍu nā sūbunā...

e dūramo e tīramo praśhniṁchanī payanaṁlona
ī dārido sahavāsamai kŏnasāganā edemainā....
mogiṁdi jegaṁṭa maṁche jarigenaṁṭa
manasaṁṭoṁdi ī māḍa...manasaṁṭoṁdi ī māḍa

saraṇaṁ 2:

ŏga saluvana ŏga vĕlugugā jada kalasinado sāyaṁ
manasĕrigina madhumāsamai nanu sersiṁde gamyaṁ
kala niluvani kanubābalo kaḽalŏliginado udayaṁ
adi mŏdaluna nanu musirina egāṁtaṁ maḍumāyaṁ
nā suṭṭū aṁdaṁgā māriṁdī logaṁ...
ūhallo nainā ledī nijaṁ...

sirunavvudo ī parisayaṁ varamayyilā nanu serenā..
badulaḍagani ī parimaḽaṁ nā janmane murubiṁchenā...
mogiṁdi jegaṁṭa maṁche jarigenaṁṭa
manasaṁṭoṁdi ī māḍa...o...manasaṁṭoṁdi ī māḍa