Modadi soobe naalona mallele sallenaa

మొదటి చూపే నాలోన మల్లెలే చల్లెనా
Work
Year
Language

పల్లవి:

మొదటి చూపే నాలోనా మల్లెలే చల్లెనా
మొదటి చూపే నాలోనా మల్లెలే చల్లెనా
చూపుతోనే రేగేనే ప్రేమనే భావన
చినుకులా కలిసేనా.. చిగురు తోడిగేనా
వరదలా ముంచేనా.. ఈ కలల ఆలాపన

హా.. మొదటి చూపే నాలోనా.. మల్లెలే చల్లెనా
నీ చూపుతోనే రేగేనే ప్రేమనే భావన

వద్దు గురువా ప్రేమ గొడవా.. జిందగీ సిందరవందర
కళ్ళు మూసి బ్లైండ్ గా సుందరి మోజులో దెబ్బైపోకుర
రోమియో లా జూలియట్ తో డ్యూయట్ట కి ఏందిర తొందర?
సిన్సియర్ గా నువ్విలా పాయిజన్ గ్లాస్ కు ఫ్లాట్ అయిపోకురో..

చరణం 1:

వెన్నెల మెరుపంటి సన్నజాజి సోయగమంతా.. నీ కందిస్తా నిధిగా
తియ్యని ఎరుపౌతా నీ పెదాలనంటే ఉంటా.. పోలేనంటా విడిగా

ఎదలయ మురిసే పిలుపుల వలలో ముడిపడిపోతా చనువుగా
కుదురును చెరిపే కులుకుల జతలో వసంతాలు చూస్తా
అందీ ఆనందం చెరి కొంత

వద్దు గురువా ప్రేమ గొడవ జిందగీ కత్తెర కత్తెర
ఆచి తూచి బురదలో అడుగెయ్యొద్దురా అల్లరి గాకురో
మజ్ను లాగా ఫీల్ అయిపోయి లైల తో లింకయిపోకురో
ప్రేమ ముదిరి పిచ్చిగా రోడ్డున పడితే పరువే పోద్దురో

లవ్ వద్దు బిడ్వ పిల్ల గోలా వద్దు
దణ్ణం పెడతా బిడ్వ పిల్లా గాలీ అస్లే వద్దు
లవ్ వద్దు బిడ్వ పిల్ల గోలా వద్దు
వద్దు వద్దు వద్దు వద్దు వద్దుర బాబు వద్దు

చరణం 2:

నాలో లోలోన నిన్ను బందీ చేసేస్తున్నా.. మన్నిస్తావా మదనా
తెలుసా నా కన్నా ఎక్కువే నిను ప్రేమిస్తున్నా.. తీరేదేనా తపన

ఒకరికి ఒకరై ఒదిగిన కధలో ఎవరెవరంటే తెలియదే
వెనుకటి రుణమే వదలని వరమై ఇలా చేరుకుందే
జన్మాలెన్నైనా చెలి నీదే

వద్దు గురువా ప్రేమ గొడవ జిందగీ గజిబిజి గత్తర
ఒళ్ళు మరిచే రేంజ్ లో సుడిలో పడవై మునిగే పోకురా
దేవదాసై మందు బాసై పార్వతికి పడిపోవద్దురా
జరగబోయే సంగతి హిస్టరీ మనకు ముందే తెలిపెరా

pallavi:

mŏdaḍi sūbe nālonā mallĕle sallĕnā
mŏdaḍi sūbe nālonā mallĕle sallĕnā
sūbudone regene premane bhāvana
sinugulā kalisenā.. siguru toḍigenā
varadalā muṁchenā.. ī kalala ālābana

hā.. mŏdaḍi sūbe nālonā.. mallĕle sallĕnā
nī sūbudone regene premane bhāvana

vaddu guruvā prema gŏḍavā.. jiṁdagī siṁdaravaṁdara
kaḽḽu mūsi blaiṁḍ gā suṁdari mojulo dĕbbaibogura
romiyo lā jūliyaṭ to ḍyūyaṭṭa ki eṁdira tŏṁdara?
sinsiyar gā nuvvilā pāyijan glās ku phlāṭ ayiboguro..

saraṇaṁ 1:

vĕnnĕla mĕrubaṁṭi sannajāji soyagamaṁtā.. nī kaṁdistā nidhigā
tiyyani ĕrubaudā nī pĕdālanaṁṭe uṁṭā.. polenaṁṭā viḍigā

ĕdalaya murise pilubula valalo muḍibaḍibodā sanuvugā
kudurunu sĕribe kulugula jadalo vasaṁtālu sūstā
aṁdī ānaṁdaṁ sĕri kŏṁta

vaddu guruvā prema gŏḍava jiṁdagī kattĕra kattĕra
āsi tūsi buradalo aḍugĕyyŏddurā allari gāguro
majnu lāgā phīl ayiboyi laila to liṁkayiboguro
prema mudiri pichchigā roḍḍuna paḍide paruve podduro

lav vaddu biḍva pilla golā vaddu
daṇṇaṁ pĕḍadā biḍva pillā gālī asle vaddu
lav vaddu biḍva pilla golā vaddu
vaddu vaddu vaddu vaddu vaddura bābu vaddu

saraṇaṁ 2:

nālo lolona ninnu baṁdī sesestunnā.. mannistāvā madanā
tĕlusā nā kannā ĕkkuve ninu premistunnā.. tīredenā tabana

ŏgarigi ŏgarai ŏdigina kadhalo ĕvarĕvaraṁṭe tĕliyade
vĕnugaḍi ruṇame vadalani varamai ilā seruguṁde
janmālĕnnainā sĕli nīde

vaddu guruvā prema gŏḍava jiṁdagī gajibiji gattara
ŏḽḽu marise reṁj lo suḍilo paḍavai munige pogurā
devadāsai maṁdu bāsai pārvadigi paḍibovaddurā
jaragaboye saṁgadi hisṭarī managu muṁde tĕlibĕrā