Merise meghamaaliga

మెరిసే మేఘమాలిక
Work
Year
Language

పల్లవి:

మెరిసే మేఘ మాలికా.. ఉరుములు చాలు చాలిక
చెలితో మాట్లాడనీ.. వలపే పాట పాడనీ.. వలపే పాట పాడనీ
మెరిసే మేఘ మాలికా.. ఉరుములు చాలు చాలిక

చరణం 1:

కమలాలే నా రమణి నయనాలై విరిసే
అద్దాలే నా చెలియ చెక్కిళ్ళై మెరిసే
ఆ నయనాల కమలాలలోనా.. నా జిలుగు కలలు చూసుకోనీ
ఆ అద్దాల చెక్కిళ్ళోనా.. నా ముద్దులే దాచుకోనీ

చరణం 2:

మధుమాసం చెలి మోవిని దరహాసం చేసే
చలి జాబిలి చెలి మోమున కళలారబోసే
ఆ దరహాస కిరణాలలోనా.. నను కలకాలం కరిగిపోనీ
ఆ కళల పండు వెన్నెలలోనా.. నా వలపులన్ని వెలిగిపోనీ....

pallavi:

mĕrise megha māligā.. urumulu sālu sāliga
sĕlido māṭlāḍanī.. valabe pāḍa pāḍanī.. valabe pāḍa pāḍanī
mĕrise megha māligā.. urumulu sālu sāliga

saraṇaṁ 1:

kamalāle nā ramaṇi nayanālai virise
addāle nā sĕliya sĕkkiḽḽai mĕrise
ā nayanāla kamalālalonā.. nā jilugu kalalu sūsugonī
ā addāla sĕkkiḽḽonā.. nā muddule dāsugonī

saraṇaṁ 2:

madhumāsaṁ sĕli movini darahāsaṁ sese
sali jābili sĕli momuna kaḽalārabose
ā darahāsa kiraṇālalonā.. nanu kalagālaṁ karigibonī
ā kaḽala paṁḍu vĕnnĕlalonā.. nā valabulanni vĕligibonī....