మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
పల్లవి:
మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం
వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం
తడిపే తడికి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళా
ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకె సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం
మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం
చరణం 1:
నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్నా
ఈ తొలకరిలో తల తల నాట్యం నీదేనా
ఆ ఉరుములలోన నీ పిలుపులు వింటున్నా
ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా
మతి చెడే దాహమై అనుసరించి వస్తున్నా
జత పడే స్నేహమై అనునయించనా
చలి పిడుగుల సడి విని జడిసిన బిడియం తడబడి నిన్ను విడదా
చరణం 2:
ఏ తెరమరుగైన ఈ చొరవను ఆపేనా
నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా
ఏ చిరు చినుకైన నీ సిరులను చూపేనా
ఆ వరుణికె ఋణపడిపోనా ఈ పైన
త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైన
విడుదలే వద్దనే ముడులువేయనా
మన కలయిక చెదరని చెలిమి ఋజువని చరితలు చదివేలా
pallavi:
mĕllagā karaganī rĕṁḍu manasula dūraṁ
sallagā tĕravani kŏṁṭĕ talabula dvāraṁ
valabu vāna dārāle paṁpudunnadi āgāśhaṁ
sinugu pūla hārāle alludunnadi mana kosaṁ
taḍibe taḍigi tanado naḍibi harivillunu vaṁtĕna vesina śhubhaveḽā
ī varṣhaṁ sākṣhigā tĕlabanī nuvu nāgĕ sŏṁtaṁ
ī varṣhaṁ sākṣhigā kalabanī baṁdhaṁ
mĕllagā karaganī rĕṁḍu manasula dūraṁ
sallagā tĕravani kŏṁṭĕ talabula dvāraṁ
saraṇaṁ 1:
nī mĕligalalona ā mĕrubulu sūstunnā
ī tŏlagarilo tala tala nāṭyaṁ nīdenā
ā urumulalona nī pilubulu viṁṭunnā
ī siḍabaḍalo siḍigĕla tāḽaṁ nīdenā
madi sĕḍe dāhamai anusariṁchi vastunnā
jada paḍe snehamai anunayiṁchanā
sali piḍugula saḍi vini jaḍisina biḍiyaṁ taḍabaḍi ninnu viḍadā
saraṇaṁ 2:
e tĕramarugaina ī sŏravanu ābenā
nā paruvamu nī kanulagu kānuga istunnā
e siru sinugaina nī sirulanu sūbenā
ā varuṇigĕ ṛṇabaḍibonā ī paina
tvarabaḍe vayasune nilubalenu igabaina
viḍudale vaddane muḍuluveyanā
mana kalayiga sĕdarani sĕlimi ṛjuvani saridalu sadivelā