Marala telubanaa

మరల తెలుపనా
Year
Language

పల్లవి:

మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా
మరల తెలుపనా ప్రియా మరలతెలుపనా
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని ||2||
కనుపాపలు నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని
మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా

చరణం 1:

విరబూసిన వెన్నెలలో తెర తీసిన బిడియాలని ||2||
అణువణువూ అల్లుకున్న అంతులేని విరహాలని ||2||
నిదురపోని కన్నులలో పవళించు ఆశలని
చెప్పలేక చేతకాక మనసుపడే తడబాటుని
మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా

చరణం 2:

నిన్నలేని భావమేదో కనులు తెరిచి కలయజూచి ||2||
మాటరాని మౌనమేదో పెదవి మీద అరిగిపోయి ||2||
ఒక క్షణమే ఆవేదన మరుక్షణమె ఆరాధన
తెలియరాక తెలుపలేక మనసుపడే మధురబాధ
మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా
మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా

pallavi:

marala tĕlubanā priyā marala tĕlubanā
marala tĕlubanā priyā maraladĕlubanā
ĕdaloyala dāsugunna madhurohala parimaḽānni ||2||
kanubābalu niṁpugunna sirunavvula parisayānni
marala tĕlubanā priyā marala tĕlubanā

saraṇaṁ 1:

virabūsina vĕnnĕlalo tĕra tīsina biḍiyālani ||2||
aṇuvaṇuvū allugunna aṁtuleni virahālani ||2||
niduraboni kannulalo pavaḽiṁchu āśhalani
sĕppalega sedagāga manasubaḍe taḍabāḍuni
marala tĕlubanā priyā marala tĕlubanā

saraṇaṁ 2:

ninnaleni bhāvamedo kanulu tĕrisi kalayajūsi ||2||
māḍarāni maunamedo pĕdavi mīda arigiboyi ||2||
ŏga kṣhaṇame āvedana marukṣhaṇamĕ ārādhana
tĕliyarāga tĕlubalega manasubaḍe madhurabādha
marala tĕlubanā priyā marala tĕlubanā
marala tĕlubanā priyā marala tĕlubanā