Manasuna unnadi seppaalanunnadi maadalu ra

మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు ర
Year
Language

పల్లవి:

మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా
మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా
ఒకసారి దరి చేరి ఎద గొడవేమిటో తెలపకపోతే ఎలా

చరణం 1:

చింత నిప్పైనా చల్లగ ఉందని ఎంత నొప్పైన తెలియలేదని
తననే తలచుకొనే వేడిలో
ప్రేమ అంటేనే తీయని బాధని
లేత గుండెల్లో కొండంత బరువని
కొత్తగా తెలుసుకొనే వేళలో
కనపడుతోందా నా ప్రియమైన నీకు
నా ఎద కోత అని అడగాలని
అనుకుంటు తన చుట్టు మరి తిరిగిందని..
తెలపకపోతే ఎలా

చరణం 2:

నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి నాకింక చోటెక్కడుందని
నిదరే కసురుకొనే రేయిలో
మేలుకొన్నాయిలే వింత కైపని
వేల ఊహల్లో ఊరేగే చూపుని
కలలే ముసురుకొనే హాయిలో
వినబడుతోందా నా ప్రియమైన నీకు
ఆశల రాగం అని అడగాలని
పగలేదో రేయేదో గురుతేలేదని
తెలపకపోతే ఎలా

pallavi:

manasuna unnadi sĕppālanunnadi māḍalu rāve ĕlā
māḍuna unnadi o maṁchi saṁgadi bayaḍigi rāde ĕlā
adaḍini sūste rĕppalu vāliboye biḍiyaṁ ābedĕlā
ĕduruga vaste sĕppaga āgiboye talabulu sūbedĕlā
ŏgasāri dari seri ĕda gŏḍavemiḍo tĕlabagabode ĕlā

saraṇaṁ 1:

siṁta nippainā sallaga uṁdani ĕṁta nŏppaina tĕliyaledani
tanane talasugŏne veḍilo
prema aṁṭene tīyani bādhani
leda guṁḍĕllo kŏṁḍaṁta baruvani
kŏttagā tĕlusugŏne veḽalo
kanabaḍudoṁdā nā priyamaina nīgu
nā ĕda koda ani aḍagālani
anuguṁṭu tana suṭṭu mari tirigiṁdani..
tĕlabagabode ĕlā

saraṇaṁ 2:

nīli kannullo adani bŏmmani sūsi nāgiṁka soḍĕkkaḍuṁdani
nidare kasurugŏne reyilo
melugŏnnāyile viṁta kaibani
vela ūhallo ūrege sūbuni
kalale musurugŏne hāyilo
vinabaḍudoṁdā nā priyamaina nīgu
āśhala rāgaṁ ani aḍagālani
pagaledo reyedo gurudeledani
tĕlabagabode ĕlā