Manasuna manasugaa nilisina kalavaa

మనసున మనసుగా నిలిచిన కలవా
Work
Year
Language

పల్లవి:

మనసున మనసుగా నిలిచిన ..కలవా
పిలిచినా పలకగ ఎదటనే.. కలవా
దొరికినదే నా స్వర్గం ..పరిచినదే విరి మార్గం
మిన్నుల్లో నీవే ..మన్నుల్లో నీవే ..కన్నుల్లో నీవే ..రావా

చరణం 1:

మేఘం నేల ఒళ్ళు ..మీటే రాగమల్లే.. ప్రేమావరాల జల్లు కావా
పిలుపే అందుకొని.. బదులే తెలుపుకొను.. కౌగిట ఒదిగి ఉండనీవా

నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా ..తగునా
మల్లెపూల మాలై నిన్నే వరించి పూజించే వేళ
నిరీక్షించు స్నేహం కోరి ..జతనై రానా రానా
ఉప్పొంగి పోయే ప్రాయం ..నిన్ను విడువదు ఏ వేళైనా

నా శ్వాస ప్రతి పూట.. వినిపించు నీ పాట
ఏడేడు జన్మాలు నేనుంటా నీ జంట!!

మనసున మనసుగా నిలిచిన ..కలవా
పిలిచినా పలకగ ఎదటనే.. కలవా
దొరికినదే నా స్వర్గం ..పరిచినదే విరి మార్గం
మిన్నుల్లో నీవే ..మన్నుల్లో నీవే ..కన్నుల్లో నీవే ..రావా

చరణం 2:

పువ్వై నవ్వులని ..తేనై మాధురిని ..పంచే పాట ..మన ప్రేమా
విరిసే చంద్రకళ ..ఎగసే కడలి అల .. పలికే కవిత ..మన ప్రేమా

కాలాన్ని పరిపాలిద్దాం ..కన్న కలలే నిజమై
వేటాడు ఎడబాటు ..ఏనాడు కలగదు ..ఇంక ఇటుపై
నూరేళ్ళ కాలం కూడా ఒక్క క్షణమై ..క్షణమై
నువ్వు నేను చెరి సగం అవుదాం.. వయస్సు పండించే వరమై

ప్రియమైన అనురాగం.. పలికింది మధు గీతం
తుదే లేని ఆనందం వేచేనే నీ కోసం !!

మనసున మనసుగా నిలిచిన ..కలవా
పిలిచినా పలకగ ఎదటనే.. కలవా
దొరికినదే నా స్వర్గం ..పరిచినదే విరి మార్గం
మిన్నుల్లో నీవే ..మన్నుల్లో నీవే ..కన్నుల్లో నీవే ..రావా

pallavi:

manasuna manasugā nilisina ..kalavā
pilisinā palagaga ĕdaḍane.. kalavā
dŏriginade nā svargaṁ ..parisinade viri mārgaṁ
minnullo nīve ..mannullo nīve ..kannullo nīve ..rāvā

saraṇaṁ 1:

meghaṁ nela ŏḽḽu ..mīḍe rāgamalle.. premāvarāla jallu kāvā
pilube aṁdugŏni.. badule tĕlubugŏnu.. kaugiḍa ŏdigi uṁḍanīvā

nā guṁḍĕ kovĕla viḍisi vĕḽḽa tagunā ..tagunā
mallĕbūla mālai ninne variṁchi pūjiṁche veḽa
nirīkṣhiṁchu snehaṁ kori ..jadanai rānā rānā
uppŏṁgi poye prāyaṁ ..ninnu viḍuvadu e veḽainā

nā śhvāsa pradi pūḍa.. vinibiṁchu nī pāḍa
eḍeḍu janmālu nenuṁṭā nī jaṁṭa!!

manasuna manasugā nilisina ..kalavā
pilisinā palagaga ĕdaḍane.. kalavā
dŏriginade nā svargaṁ ..parisinade viri mārgaṁ
minnullo nīve ..mannullo nīve ..kannullo nīve ..rāvā

saraṇaṁ 2:

puvvai navvulani ..tenai mādhurini ..paṁche pāḍa ..mana premā
virise saṁdragaḽa ..ĕgase kaḍali ala .. palige kavida ..mana premā

kālānni paribāliddāṁ ..kanna kalale nijamai
veḍāḍu ĕḍabāḍu ..enāḍu kalagadu ..iṁka iḍubai
nūreḽḽa kālaṁ kūḍā ŏkka kṣhaṇamai ..kṣhaṇamai
nuvvu nenu sĕri sagaṁ avudāṁ.. vayassu paṁḍiṁche varamai

priyamaina anurāgaṁ.. paligiṁdi madhu gīdaṁ
tude leni ānaṁdaṁ vesene nī kosaṁ !!

manasuna manasugā nilisina ..kalavā
pilisinā palagaga ĕdaḍane.. kalavā
dŏriginade nā svargaṁ ..parisinade viri mārgaṁ
minnullo nīve ..mannullo nīve ..kannullo nīve ..rāvā