పల్లవి:
మనసున మనసై
బ్రతుకున బ్రతుకై
మనసున మనసై
బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము ||2||
చరణం 1:
ఆశలు తీరని ఆవేశములో
ఆశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతములో తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము!
చరణం 2:
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు ||2||
నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము!
చరణం 3:
చేలిమియే కరువై వలపే అరుదై
చేదరిన హృదయమే శిలయై పోగా
నీ వ్యధ తేలిసి నీడగ నిలిచి తోడొకరుండిన అదే భాగ్యము .. అదే స్వర్గము!
మనసున
pallavi:
manasuna manasai
braduguna bradugai
manasuna manasai
braduguna bradugai
toḍŏgaruṁḍina ade bhāgyamu .. ade svargamu ||2||
saraṇaṁ 1:
āśhalu tīrani āveśhamulo
āśhayālalo āvedanalo
sīgaḍi mūsina egāṁtamulo toḍŏgaruṁḍina ade bhāgyamu .. ade svargamu!
saraṇaṁ 2:
ninnu ninnugā premiṁchuḍagu
nī kosame kannīru niṁchuḍagu ||2||
nenunnānani niṁḍuga palige toḍŏgaruṁḍina ade bhāgyamu .. ade svargamu!
saraṇaṁ 3:
selimiye karuvai valabe arudai
sedarina hṛdayame śhilayai pogā
nī vyadha telisi nīḍaga nilisi toḍŏgaruṁḍina ade bhāgyamu .. ade svargamu!
manasuna