Manasu parimalimchene tanuvu paravashimchene

మనసు పరిమళించెనే తనువు పరవశించెనే
Year
Language

పల్లవి:

మనసు పరిమళించెనే తనువు పరవశించెనే
నవ వసంత గానముతో నీవు నటన సేయగనే
మనసు పరిమళించెనే తనువు పరవశించెనే
నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే

చరణం 1:

నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా
ఆహ.. ఆ . అ ఆ
నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా
గలగలగల సెలయేరులలో కలకలములు రేగగా !

చరణం 2:

క్రొత్త పూల నెత్తావులతో మత్తుగాలి వీచగా
ఆహ .. ఆ . అ ఆ
క్రొత్త పూల నెత్తావులతో మత్తుగాలి వీచగా
భ్రమరమ్ములు గుములు గుములుగా ఝుం ఝుమ్మని పాడగా !

చరణం 3:

తెలి మబ్బులు కొండ కొనలపై హంసల వలె ఆడగా
అహా .. ఆ . అ.. ఆ
తెలి మబ్బులు కొండ కొనలపై హంసల వలె ఆడగా
రంగరంగ వైభవములతో ప్రకృతి విందు సేయగా !!

pallavi:

manasu parimaḽiṁchĕne tanuvu paravaśhiṁchĕne
nava vasaṁta gānamudo nīvu naḍana seyagane
manasu parimaḽiṁchĕne tanuvu paravaśhiṁchĕne
nava vasaṁta rāgamudo nīvu sĕṁta niluvagane

saraṇaṁ 1:

nīgu nāgu svāgadamanagā koyilamma kūyagā
āha.. ā . a ā
nīgu nāgu svāgadamanagā koyilamma kūyagā
galagalagala sĕlayerulalo kalagalamulu regagā !

saraṇaṁ 2:

krŏtta pūla nĕttāvulado mattugāli vīsagā
āha .. ā . a ā
krŏtta pūla nĕttāvulado mattugāli vīsagā
bhramarammulu gumulu gumulugā jhuṁ jhummani pāḍagā !

saraṇaṁ 3:

tĕli mabbulu kŏṁḍa kŏnalabai haṁsala valĕ āḍagā
ahā .. ā . a.. ā
tĕli mabbulu kŏṁḍa kŏnalabai haṁsala valĕ āḍagā
raṁgaraṁga vaibhavamulado prakṛti viṁdu seyagā !!