మనసే ఎదురు తిరిగి మాట వినదే
పల్లవి:
మనసే యెదురు తిరిగి మాట వినదే....
కలిసే ఆశ కలిగి కునుకు పడదే...
మొదలైన నా పరుగు ..నీ నీడలో నిలుపు...
తుదిలేని ఊహలకు.. నీ స్నేహమే అదుపు
ప్రణయానికే మన జంటనే కదా కొత్త మైమరపు
చరణం 1:
కలలో మొదటి పరిచయం గురుతువుందా...
సరెలే చెలిమి పరిమళం చెరుగుతుందా...
చెలివైన చెంగలువా.. కలలోనె నీ కొలువా...
చెలిమైన వెన్నెలవా... నిజమైన నా కలవా...
నిను వీణగా కొనగోట మీటితే... నిదురపోగలవా
చరణం 2:
చినుకై కురిసినది కదా.. చిలిపి సరదా..
అలలై ఎగసినది కదా ...వలపు వరదా..
మనసే తడిసి తడిసి పరదా కరిగిపోదా
తలపే మెరిసి మెరిసి తగు దారి కనపడదా
వెతికే జతే కలిసి ..వయసు మరి ఆగనంది కదా...
మనసే యెదురు తిరిగి మాట వినదే....
కలిసే ఆశ కలిగి కునుకు పడదే...
మొదలైన నా పరుగు ..నీ నీడలో నిలుపు...
తుదిలేని ఊహలకు.. నీ స్నేహమే అదుపు
ప్రణయానికే మన జంటనే కదా కొత్త మైమరపు
pallavi:
manase yĕduru tirigi māḍa vinade....
kalise āśha kaligi kunugu paḍade...
mŏdalaina nā parugu ..nī nīḍalo nilubu...
tudileni ūhalagu.. nī snehame adubu
praṇayānige mana jaṁṭane kadā kŏtta maimarabu
saraṇaṁ 1:
kalalo mŏdaḍi parisayaṁ guruduvuṁdā...
sarĕle sĕlimi parimaḽaṁ sĕruguduṁdā...
sĕlivaina sĕṁgaluvā.. kalalonĕ nī kŏluvā...
sĕlimaina vĕnnĕlavā... nijamaina nā kalavā...
ninu vīṇagā kŏnagoḍa mīḍide... nidurabogalavā
saraṇaṁ 2:
sinugai kurisinadi kadā.. silibi saradā..
alalai ĕgasinadi kadā ...valabu varadā..
manase taḍisi taḍisi paradā karigibodā
talabe mĕrisi mĕrisi tagu dāri kanabaḍadā
vĕdige jade kalisi ..vayasu mari āganaṁdi kadā...
manase yĕduru tirigi māḍa vinade....
kalise āśha kaligi kunugu paḍade...
mŏdalaina nā parugu ..nī nīḍalo nilubu...
tudileni ūhalagu.. nī snehame adubu
praṇayānige mana jaṁṭane kadā kŏtta maimarabu