Manasaa palagave madhumaasabu koyilavai

మనసా పలకవే మధుమాసపు కోయిలవై
Year
Language

పల్లవి:

మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై
మంచుతెరలే తెరుచుకుని.. మంచి తరుణం తెలుసుకుని.. నవ్వులే పువ్వులై విరియగా.. ఓ.. ఓ.. ఓ..
ఆ.. ఆ.. ఆ.. ఆ..
తుమ్మెద తుమ్మెద విన్నావమ్మా నిన్ను ఝుమ్మంటు రమ్మంది రంగేళి పూలకొమ్మా

మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై

చరణం 1:

నాలో కులుకుల కునుకును రేపి.. లోలో తెలియని తలపులు రేపి
పిలిచే వలపుల వెలుగును చూపి లాగే రాగమిది.. ఓ.. ఓ..
నీలో మమతల మధువుని చూసి.. నాలో తరగని తహతహ దూకి
నీకై గలగల పరుగులు తీసి చేరే వేగమిది..
ఆరారు కాలాల వర్ణాలతో నీరాజనం నీకు అందించనా
ఏడేడు జన్మాల బంధాలతో ఈ నాడు నీ ఈడు పండించనా
మరి తయ్యారయ్యే ఉన్నా వయ్యారంగా సయ్యంటు ఒళ్ళోకి వాలంగా
దూసుకొచ్చానమ్మా చూడు ఉత్సాహంగా చిన్నారి వన్నెల్ని ఏలంగా
ప్రతిక్షణం.. పరవశం.. కలగగా.. ఓ..ఓ..ఓ..

మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై

చరణం 2:

ఆడే మెరుపుల మెలికల జానా.. పాడే జిలిబిలి పలుకుల మైనా
రాలే తొలకరి చినుకులలోనా తుళ్ళే తిల్లానా
వేగే పదముల తపనలపైనా .. వాలే చినుకుల చెమటల వానా
మీటే చిలిపిగ నరముల వీణ తియ్యని తాళానా
బంగారు శృంగార భావాలతో పొంగారు ప్రాయాన్ని కీర్తించనా
అందాల మందారహారాలతో నీ గుండె రాజ్యాన్ని పాలించనా
ఇక వెయ్యేళ్ళైనా నిన్ను విడిపోనంటూ ముమ్మారు ముద్దాడి ఒట్టేయనా
నువ్వు వెళ్ళాలన్నా ఇంక వీల్లేదంటూ స్నేహాల సంకెళ్ళు కట్టేయనా
కాలమే ..కదలక.. నిలువగా.. ఓ..ఓ..ఓ..

మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై
మంచుతెరలే తెరుచుకుని.. మంచి తరుణం తెలుసుకుని.. నవ్వులే పువ్వులై విరియగా.. ఓ.. ఓ.. ఓ..

pallavi:

manasā palagave madhumāsabu koyilavai
sĕlime tĕlubave sigurāśhala gīdigavai
maṁchudĕrale tĕrusuguni.. maṁchi taruṇaṁ tĕlusuguni.. navvule puvvulai viriyagā.. o.. o.. o..
ā.. ā.. ā.. ā..
tummĕda tummĕda vinnāvammā ninnu jhummaṁṭu rammaṁdi raṁgeḽi pūlagŏmmā

manasā palagave madhumāsabu koyilavai
sĕlime tĕlubave sigurāśhala gīdigavai

saraṇaṁ 1:

nālo kulugula kunugunu rebi.. lolo tĕliyani talabulu rebi
pilise valabula vĕlugunu sūbi lāge rāgamidi.. o.. o..
nīlo mamadala madhuvuni sūsi.. nālo taragani tahadaha dūgi
nīgai galagala parugulu tīsi sere vegamidi..
ārāru kālāla varṇālado nīrājanaṁ nīgu aṁdiṁchanā
eḍeḍu janmāla baṁdhālado ī nāḍu nī īḍu paṁḍiṁchanā
mari tayyārayye unnā vayyāraṁgā sayyaṁṭu ŏḽḽogi vālaṁgā
dūsugŏchchānammā sūḍu utsāhaṁgā sinnāri vannĕlni elaṁgā
pradikṣhaṇaṁ.. paravaśhaṁ.. kalagagā.. o..o..o..

manasā palagave madhumāsabu koyilavai
sĕlime tĕlubave sigurāśhala gīdigavai

saraṇaṁ 2:

āḍe mĕrubula mĕligala jānā.. pāḍe jilibili palugula mainā
rāle tŏlagari sinugulalonā tuḽḽe tillānā
vege padamula tabanalabainā .. vāle sinugula sĕmaḍala vānā
mīḍe silibiga naramula vīṇa tiyyani tāḽānā
baṁgāru śhṛṁgāra bhāvālado pŏṁgāru prāyānni kīrdiṁchanā
aṁdāla maṁdārahārālado nī guṁḍĕ rājyānni pāliṁchanā
iga vĕyyeḽḽainā ninnu viḍibonaṁṭū mummāru muddāḍi ŏṭṭeyanā
nuvvu vĕḽḽālannā iṁka vīlledaṁṭū snehāla saṁkĕḽḽu kaṭṭeyanā
kālame ..kadalaga.. niluvagā.. o..o..o..

manasā palagave madhumāsabu koyilavai
sĕlime tĕlubave sigurāśhala gīdigavai
maṁchudĕrale tĕrusuguni.. maṁchi taruṇaṁ tĕlusuguni.. navvule puvvulai viriyagā.. o.. o.. o..