Managu dostee ogade aastiraa

మనకు దోస్తీ ఒకటే ఆస్తిరా
Year
Language

పల్లవి:

మనకు దోస్తీ ఒకటే ఆస్తిరా
జబరుదస్తీ చేస్తే శాస్తిరా
విడిపోకు చెలిమితో చెడిపోకు కలిమితో
జీవితాలు శాశ్వతాలు కావురా
దోస్తీ ఒకటే ఆస్తిరా
జబరుదస్తీ చేస్తే శాస్తిరా

చరణం 1:

కాదురా ఆటబొమ్మ ఆడదే నీకు అమ్మ
ఎత్తరా కొత్త జన్మ ప్రేమ నీ తాత సొమ్మా
అలుసుగా ఆడకు మనసుతో..
తెలుసుకో తెలివిగా మసలుకో
ఉన్నదా నీకు దమ్ము దులుపుతా నీకు దుమ్ము
అలుసుగా ఆడకు మనసుతో
ఆ ప్రేమ ధనికుల విలువలు గని .. నీ వంటి ధనికులు వెలవెలమని
ఆ ప్రేమ ధనికుల విలువలు గని .. నీ వంటి ధనికులు వెలవెలమని
జీవిస్తే ఫలితమేమిటి ..శ్రీరాగమున కీర్తనలు మానరా!

దోస్తీ ఒకటే ఆస్తిరా .. జబరుదస్తీ చేస్తే శాస్తిరా

చరణం 2:

ప్రేమకై నీవు పుట్టు ప్రేమకై నీవు బ్రతుకు
ప్రేమకై నీవు చచ్చి ప్రేమవై తిరిగి పుట్టు
మరణమే లేనిది మనసురా
క్షణికమే యవ్వనమ్ము కల్పనే జీవనమ్ము
నమ్ముకో దిక్కుగా ప్రేమనే
ఈ జనన మరణ వలయములనిక ఛేదించి మమతను మతమనుకుని
ఈ జనన మరణ వలయములనిక ఛేదించి మమతను మతమనుకుని
జీవించే మోక్షమార్గము .. శ్రీరస్తనుచు దీవెనగ దొరికిన!!!

దోస్తీ ఒకటే ఆస్తిరా .. జబరుదస్తీ చేస్తే శాస్తిరా
విడిపోకు చెలిమితో చెడిపోకు కలిమితో .. జీవితాలు శాశ్వతాలు కావురా

pallavi:

managu dostī ŏgaḍe āstirā
jabarudastī seste śhāstirā
viḍibogu sĕlimido sĕḍibogu kalimido
jīvidālu śhāśhvadālu kāvurā
dostī ŏgaḍe āstirā
jabarudastī seste śhāstirā

saraṇaṁ 1:

kādurā āḍabŏmma āḍade nīgu amma
ĕttarā kŏtta janma prema nī tāda sŏmmā
alusugā āḍagu manasudo..
tĕlusugo tĕlivigā masalugo
unnadā nīgu dammu dulubudā nīgu dummu
alusugā āḍagu manasudo
ā prema dhanigula viluvalu gani .. nī vaṁṭi dhanigulu vĕlavĕlamani
ā prema dhanigula viluvalu gani .. nī vaṁṭi dhanigulu vĕlavĕlamani
jīviste phalidamemiḍi ..śhrīrāgamuna kīrdanalu mānarā!

dostī ŏgaḍe āstirā .. jabarudastī seste śhāstirā

saraṇaṁ 2:

premagai nīvu puṭṭu premagai nīvu bradugu
premagai nīvu sachchi premavai tirigi puṭṭu
maraṇame lenidi manasurā
kṣhaṇigame yavvanammu kalbane jīvanammu
nammugo dikkugā premane
ī janana maraṇa valayamulaniga shediṁchi mamadanu madamanuguni
ī janana maraṇa valayamulaniga shediṁchi mamadanu madamanuguni
jīviṁche mokṣhamārgamu .. śhrīrastanusu dīvĕnaga dŏrigina!!!

dostī ŏgaḍe āstirā .. jabarudastī seste śhāstirā
viḍibogu sĕlimido sĕḍibogu kalimido .. jīvidālu śhāśhvadālu kāvurā