పల్లవి:
మంచిని సమాధి చేస్తారా..??
ఇది మనుషులు చేసే పని యేనా..??
మనలో పాపం చేయని వాడు... ఎవడో చెప్పండి..
ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి..!!
మంచిని సమాధి చేస్తారా..?? ఇది మనుషులు చేసే పనియేనా..?? !! మనలో!!
చరణం 1:
కత్తితో చేధించనిది కరుణతో చేధించాలి.
కక్షతో కానిది క్షమాభిక్షతో సాధించాలి..
తెలిసీ తెలీయక కాలు జారితే....ఏ..ఏ..
తెలిసీ తెలియక కాలు జారితే... చేయూతనిచ్చి నిలపాలీ !
మనలో కాలు జారని వారు.. ఎవరో చెప్పండి..
లోపాలు లేని వారు.... ఎవరో చూపండి..!!
మంచిని సమాధి చేస్తారా..? ఇది మనుషులు చేసే పనియేనా...?? !!మనలో!!
చరణం 2:
గుడులలో లింగాలను మింగే బడా భక్తులు కొందరు...
ముసుగులో మోసాలు చేసే మహా వ్యక్తులు కొందరు..
ఆకలి తీరక నేరం చేసే...ఏ..ఏ..
ఆకలి తీరక నేరం చేసే... అభాగ్యజీవులు కొందరూ !!
మనలో నేరం చేయని వాడూ.... ఎవడో చెప్పండి..
ఏ దోషం లేని వాడు... ఎవడో చూపండి..!!
మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా...?/ !!మనలో!!
చరణం 3:
తప్పు చేసిన ఈ దోషిని ఇప్పుడే శిక్షించాలి..
మరపురాని గుణపాఠం పదిమందిలో నేర్పించాలి..
హ హ హ.. ఐతే..
ఎన్నడు పాపం చేయని వాడు...ఊ...ఊ..ఊ
ఎన్నడు పాపం చేయని వాడు... ముందుగ రాయి విసరాలి...!
మీలో పాపం చేయని వాడే... ఆ రాయి విసరాలి..
ఏ లోపం లేని వాడే... ఆ శిక్ష విధించాలి..!!
మంచిని సమాధి చేస్తారా..?? ఇది మనుషులు చేసే పనియేనా...?? !మనలో!!
pallavi:
maṁchini samādhi sestārā..??
idi manuṣhulu sese pani yenā..??
manalo pābaṁ seyani vāḍu... ĕvaḍo sĕppaṁḍi..
e doṣhaṁ leni vāḍu ĕvaḍo sūbaṁḍi..!!
maṁchini samādhi sestārā..?? idi manuṣhulu sese paniyenā..?? !! manalo!!
saraṇaṁ 1:
kattido sedhiṁchanidi karuṇado sedhiṁchāli.
kakṣhado kānidi kṣhamābhikṣhado sādhiṁchāli..
tĕlisī tĕlīyaga kālu jāride....e..e..
tĕlisī tĕliyaga kālu jāride... seyūdanichchi nilabālī !
manalo kālu jārani vāru.. ĕvaro sĕppaṁḍi..
lobālu leni vāru.... ĕvaro sūbaṁḍi..!!
maṁchini samādhi sestārā..? idi manuṣhulu sese paniyenā...?? !!manalo!!
saraṇaṁ 2:
guḍulalo liṁgālanu miṁge baḍā bhaktulu kŏṁdaru...
musugulo mosālu sese mahā vyaktulu kŏṁdaru..
āgali tīraga neraṁ sese...e..e..
āgali tīraga neraṁ sese... abhāgyajīvulu kŏṁdarū !!
manalo neraṁ seyani vāḍū.... ĕvaḍo sĕppaṁḍi..
e doṣhaṁ leni vāḍu... ĕvaḍo sūbaṁḍi..!!
maṁchini samādhi sestārā? idi manuṣhulu sese paniyenā...?/ !!manalo!!
saraṇaṁ 3:
tappu sesina ī doṣhini ippuḍe śhikṣhiṁchāli..
maraburāni guṇabāṭhaṁ padimaṁdilo nerbiṁchāli..
ha ha ha.. aide..
ĕnnaḍu pābaṁ seyani vāḍu...ū...ū..ū
ĕnnaḍu pābaṁ seyani vāḍu... muṁduga rāyi visarāli...!
mīlo pābaṁ seyani vāḍe... ā rāyi visarāli..
e lobaṁ leni vāḍe... ā śhikṣha vidhiṁchāli..!!
maṁchini samādhi sestārā..?? idi manuṣhulu sese paniyenā...?? !manalo!!