Mallela teegala prema sidaara

మల్లెల తీగల ప్రేమ సితార
Year
Language

పల్లవి:

మల్లెల తీగల ప్రేమ సితార మన్మథ రాగంలో
ఇద్దరి కన్నుల అల్లరి చేసిన సంధ్యారాగంలో
కాముడి వీణలు కానడ పాడిన కౌగిళ్ళలో
ముద్దుకు ముద్దుగ మద్దెలు మ్రోగిన సందిళ్ళలో
వారెవా జోరు హై జోరులో ప్యార్ హై
మల్లెల తీగల ప్రేమ సితార మన్మథ రాగంలో

చరణం 1:

నంది కొండ మీదకొచ్చి నల్లమబ్బు కన్నుగీటె
సిగ్గుపడ్డ చందమామ కోనలోన కాలు జారె
ఎన్నందాలో చిగురాకు చీరలో
ఏమవ్వాలో పిడిబాకు చూపుతో
ఎల్లకిల్ల ఎల్లువైన పిల్ల సోకులో
నిను అల్లుకున్న పూల జల్లు ఇల్లు చేసుకో
కాముడి వీణలు కానడ పాడిన కౌగిళ్ళలో
ముద్దుకు ముద్దుగ మద్దెలు మ్రోగిన సందిళ్ళలో

మల్లెల తీగల ప్రేమ సితార మన్మథ రాగంలో

చరణం 2:

పాలపిట్ట గూటి కాడ పైట కొంగు భారమాయె
పాలకొండ సీమలోన బంతులాట పండగాయె
ఏం కావాలో చినవాని దాడిలో
ఏం చెయ్యాలో చలిగాలి హోరులో
కాచుకున్న కౌగిలింత కాక తీర్చుకో
తలదాచుకున్న గుండెలోన నన్ను దోచుకో
కాముడి వీణలు కానడ పాడిన కౌగిళ్ళలో
ముద్దుకు ముద్దుగ మద్దెలు మ్రోగిన సందిళ్ళలో

మల్లెల తీగల ప్రేమ సితార మన్మథ రాగంలో
ఇద్దరి కన్నుల అల్లరి చేసిన సంధ్యారాగంలో
కాముడి వీణలు కానడ పాడిన కౌగిళ్ళలో
ముద్దుకు ముద్దుగ మద్దెలు మ్రోగిన సందిళ్ళలో

pallavi:

mallĕla tīgala prema sidāra manmatha rāgaṁlo
iddari kannula allari sesina saṁdhyārāgaṁlo
kāmuḍi vīṇalu kānaḍa pāḍina kaugiḽḽalo
muddugu mudduga maddĕlu mrogina saṁdiḽḽalo
vārĕvā joru hai jorulo pyār hai
mallĕla tīgala prema sidāra manmatha rāgaṁlo

saraṇaṁ 1:

naṁdi kŏṁḍa mīdagŏchchi nallamabbu kannugīḍĕ
siggubaḍḍa saṁdamāma konalona kālu jārĕ
ĕnnaṁdālo sigurāgu sīralo
emavvālo piḍibāgu sūbudo
ĕllagilla ĕlluvaina pilla sogulo
ninu allugunna pūla jallu illu sesugo
kāmuḍi vīṇalu kānaḍa pāḍina kaugiḽḽalo
muddugu mudduga maddĕlu mrogina saṁdiḽḽalo

mallĕla tīgala prema sidāra manmatha rāgaṁlo

saraṇaṁ 2:

pālabiṭṭa gūḍi kāḍa paiḍa kŏṁgu bhāramāyĕ
pālagŏṁḍa sīmalona baṁtulāḍa paṁḍagāyĕ
eṁ kāvālo sinavāni dāḍilo
eṁ sĕyyālo saligāli horulo
kāsugunna kaugiliṁta kāga tīrsugo
taladāsugunna guṁḍĕlona nannu dosugo