Madilo veenalu mroge

మదిలో వీణలు మ్రోగే
Work
Year
Language

పల్లవి:

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే ||2||
కలనైన కనని ఆనందం ఇలలోన విరిసే ఈనాడే

చరణం 1:

సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగింది || 2||
పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది

చరణం 2:

కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందుకోరేను ||2||
అందాల తారయై మెరిసి చెలికాని చెంత చేరేను

చరణం 3:

రాధలోని అనురాగమంతా మాధవునిదేలే||2||
వేణులోలుని రాగాల కోసం వేచి ఉన్నదిలే

pallavi:

madilo vīṇalu mroge āśhalĕnno sĕlarege ||2||
kalanaina kanani ānaṁdaṁ ilalona virise īnāḍe

saraṇaṁ 1:

siggu sāḍuna nā leda valabu mŏgga tŏḍigiṁdi || 2||
pāla vĕnnĕla snānālu sesi pūlu pūsiṁdi

saraṇaṁ 2:

kĕraḍāla vĕlugu sĕṁgaluva nĕlarāju pŏṁdugorenu ||2||
aṁdāla tārayai mĕrisi sĕligāni sĕṁta serenu

saraṇaṁ 3:

rādhaloni anurāgamaṁtā mādhavunidele||2||
veṇuloluni rāgāla kosaṁ vesi unnadile