Maayadaari sinnodu

మాయదారి సిన్నోడు
Work
Year
Language

పల్లవి:

మాయదారి సిన్నోడు మనసేలాగేసిండు
నా మనసే లాగేసిండు లగ్గమెప్పుడురా మాఁవా అంటే
మాఘమాసం ఎల్లేదాకా మంచిరోజు లేదన్నాడే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
కాఁవమ్మ సెప్పవే రాఁవమ్మ సెప్పవే
రత్తమ్మ సెప్పవే అత్తమ్మ సెప్పవే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు
మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు
మాఘమాసం ఎల్లేదాకా మంచిరోజు లేదన్నాడే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా

చరణం 1:

సింతసెట్టెక్కీ సిగురులు కోస్తుంటే
సిట్టి సిట్టి గాజుల్లో తాళం ఏస్తుంటే
సింతసెట్టెక్కీ సిగురులు కోస్తుంటే
సిట్టి సిట్టి గాజుల్లో తాళం ఏస్తుంటే
సిగరుల్లో సిగురుల్లో
సిగురుల్లో మాటేసి కన్నుగీటిండే
జివ్వున పానాలు తోడేసిండే
ఎప్పుడ్రా మాఁవా అంటే
సంకురాతిరి పొయ్యేదాకా మంచిగడియే లేదన్నాడే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
ఎల్లమ్మ సెప్పవే మల్లమ్మ సెప్పవే
పుల్లమ్మ సెప్పవే బుల్లెమ్మ సెప్పవే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా

చరణం 2:

ఊరి సెరువులో నేనీదులాడుతుంటే
నీటి నురుగుల్లో తేలి తేలి పోతుంటే
ఊరి సెరువులో నేనీదులాడుతుంటే
నీటి నురుగుల్లో తేలి తేలి పోతుంటే
బుడుంగున బుడుంగున
బుడుంగునమీదికి తేలిండే
నా తడికొంగు పట్టుకుని లాగిండే
ఎప్పుడురా మాఁవా అంటే
శివరాతిరి ఎల్లేదాకా సుబలగ్గం లేదన్నాడే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
పున్నమ్మ సెప్పవే గున్నమ్మ సెప్పవే
కన్నమ్మ సెప్పవే సిన్నమ్మ సెప్పవే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా

చరణం 3:

కందిసేలల్లో కావలి కాసేసి
సందెకాడ ఒంటరిగా డొంకదారినొస్తుంటే
కందిసేలల్లో కావలి కాసేసి
సందెకాడ ఒంటరిగా డొంకదారినొస్తుంటే
గబుక్కున గుబుక్కున
గబుక్కున కళ్లు రెండు మూసిండే
రివ్వున వాటేసి నవ్వేసిండే
ఏందిరా మాఁవా అంటే
కోడికూసి కూయంగానే తాళి కడతానన్నాడే
ఆగేదెట్టాగా ఈ రాతిరి ఏగేదెట్టాగా
అమ్మమ్మ సెప్పవే అయ్యమ్మ సెప్పవే
పెద్దమ్మ సెప్పవే పిన్నమ్మ సెప్పవే
ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా
మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు
కోడి కూసి కురియంగానే తాళి కడతానన్నాడే
ఆగేదెట్టాగా ఈ రాతిరి ఏగేదెట్టాగా
ఆగేదెట్టాగా ఈ రాతిరి ఏగేదెట్టాగా

pallavi:

māyadāri sinnoḍu manaselāgesiṁḍu
nā manase lāgesiṁḍu laggamĕppuḍurā mām̐vā aṁṭe
māghamāsaṁ ĕlledāgā maṁchiroju ledannāḍe
āgedĕṭṭāgā aṁdāgā egedĕṭṭāgā
āgedĕṭṭāgā aṁdāgā egedĕṭṭāgā
kām̐vamma sĕppave rām̐vamma sĕppave
rattamma sĕppave attamma sĕppave
āgedĕṭṭāgā aṁdāgā egedĕṭṭāgā
māyadāri sinnoḍu manase lāgesiṁḍu
māyadāri sinnoḍu nā manase lāgesiṁḍu
māghamāsaṁ ĕlledāgā maṁchiroju ledannāḍe
āgedĕṭṭāgā aṁdāgā egedĕṭṭāgā

saraṇaṁ 1:

siṁtasĕṭṭĕkkī sigurulu kostuṁṭe
siṭṭi siṭṭi gājullo tāḽaṁ estuṁṭe
siṁtasĕṭṭĕkkī sigurulu kostuṁṭe
siṭṭi siṭṭi gājullo tāḽaṁ estuṁṭe
sigarullo sigurullo
sigurullo māḍesi kannugīḍiṁḍe
jivvuna pānālu toḍesiṁḍe
ĕppuḍrā mām̐vā aṁṭe
saṁkurādiri pŏyyedāgā maṁchigaḍiye ledannāḍe
āgedĕṭṭāgā aṁdāgā egedĕṭṭāgā
ĕllamma sĕppave mallamma sĕppave
pullamma sĕppave bullĕmma sĕppave
āgedĕṭṭāgā aṁdāgā egedĕṭṭāgā

saraṇaṁ 2:

ūri sĕruvulo nenīdulāḍuduṁṭe
nīḍi nurugullo teli teli poduṁṭe
ūri sĕruvulo nenīdulāḍuduṁṭe
nīḍi nurugullo teli teli poduṁṭe
buḍuṁguna buḍuṁguna
buḍuṁgunamīdigi teliṁḍe
nā taḍigŏṁgu paṭṭuguni lāgiṁḍe
ĕppuḍurā mām̐vā aṁṭe
śhivarādiri ĕlledāgā subalaggaṁ ledannāḍe
āgedĕṭṭāgā aṁdāgā egedĕṭṭāgā
punnamma sĕppave gunnamma sĕppave
kannamma sĕppave sinnamma sĕppave
āgedĕṭṭāgā aṁdāgā egedĕṭṭāgā

saraṇaṁ 3:

kaṁdiselallo kāvali kāsesi
saṁdĕgāḍa ŏṁṭarigā ḍŏṁkadārinŏstuṁṭe
kaṁdiselallo kāvali kāsesi
saṁdĕgāḍa ŏṁṭarigā ḍŏṁkadārinŏstuṁṭe
gabukkuna gubukkuna
gabukkuna kaḽlu rĕṁḍu mūsiṁḍe
rivvuna vāḍesi navvesiṁḍe
eṁdirā mām̐vā aṁṭe
koḍigūsi kūyaṁgāne tāḽi kaḍadānannāḍe
āgedĕṭṭāgā ī rādiri egedĕṭṭāgā
ammamma sĕppave ayyamma sĕppave
pĕddamma sĕppave pinnamma sĕppave
āgedĕṭṭāgā aṁdāgā egedĕṭṭāgā
māyadāri sinnoḍu nā manase lāgesiṁḍu
koḍi kūsi kuriyaṁgāne tāḽi kaḍadānannāḍe
āgedĕṭṭāgā ī rādiri egedĕṭṭāgā
āgedĕṭṭāgā ī rādiri egedĕṭṭāgā