పల్లవి:
తప్పుకోండి తప్పుకోండి అంతా
సైడు ఇవ్వకుంటే అంతే సంగతులంట
చుట్టుపక్కలలేమి చూడదంట
దారికడ్డు ఉంటే యాక్సిడెంటేనంట
జూ పాపా జూ పాపా జూ పాపా
జూ పాపా జూ పాపా జూ పాపా
Love is blind లెండి red light చూడదండి
లైన్లో అడ్డులెండి బాబు
Love sense ఉంది కాని license అంటూలేని
Love pair 1994
ఎవ్వరడ్డు వచ్చినా హే.. don't care తమ్ముడు
బ్రహ్మ దేవుడాపినా break వెయ్యకెప్పుడూ
అరె take off అందుకున్న
ఈ వెర్రి వేగాలు వేళ్లేటి రూటు వేరు
ఏమో ఎక్కడాగుతామో
వామ్మో ఎంత వింత ప్రేమో
Love is blind లెండి red light చూడదండి
లైన్లో అడ్డులెండి బాబు
Love sense ఉంది కాని license అంటూలేని
Love pair 1994
చరణం 1:
ప్రేమ అంటే పాము కాదే పెద్దవాళ్లకెందుకంత బెదురు
మాకూ మాకు ఇష్టముంటే మీకేమి నష్టమంటే చెప్పరు
ఒప్పనీ తప్పనీ వద్దనీ హద్దనీ ఇస్తారు బోలేడంత లెక్చరు
చెప్పినా వినరని తెలిసినా ఎందుకో గీస్తారు సెంటిమెంట్ల బోర్డరు
కస్టడిలో ఉంచితే..ఆ..ఆ.. కట్టుబాట్లు తెంచమా
చేత్తో ఆపగానే తుఫాను గాలంటి ఈ ప్రేమ లొంగుతుందా
ఏమో ఎక్కడాగుతామో..వామ్మో ఎంత వింత ప్రేమో
Love is blind లెండి red light చూడదండి
లైన్లో అడ్డులెండి బాబు
Love sense ఉంది కాని license అంటూలేని
Love pair 1994
చరణం 2:
డేరు చేసే దమ్ములుంటే మా లాగా ప్రేమయాత్ర చెయ్యరా
పర్మనెంట్లీ హిస్టరీలో పేజీలకొద్దీ చోటు పొందరా
కష్టమో నష్టమో ముందుకే వెళ్ళటం ప్రేమించుకున్న వాళ్ల దారి
ఎప్పుడూ ప్రేమదే అల్టిమేటు గెలుపనీ రోమియోలు జూలియట్ల థియరీ
కాదన్న వాళ్లను కళ్ళు మూసుకొమ్మను
జర్నీ ఆపకుండా జాలీగా జోడిగా పోతున్న జోరులోన
ఏమో ఎక్కడాగుతామో...వామ్మో ఎంత వింత ప్రేమో
Love is blind లెండి red light చూడదండి
లైన్లో అడ్డులెండి బాబు
బాబూ love sense ఉంది కాని license అంటూలేని
Love pair 1994
ఎవ్వరడ్డు వచ్చినా హే వింటున్నావా care చెయ్యదెప్పుడూ
బ్రహ్మ దేవుడాపినా break వెయ్యదెప్పుడూ
Take off అందుకున్న
ఈ వెర్రి వేగాలు వేళ్లేటి రూటు వేరు
ఏమో ఎక్కడాగుతామో
వామ్మో ఎంత వింత ప్రేమో
లల లల లల..
వామ్మో ఎంత వింత ప్రేమో