లోకాలే గెలవగ నిలిచినా స్నేహాల విలువ
పల్లవి:
లోకాలే గెలవగ నిలిచినా స్నేహాల విలువలు
తెలిసినా ఈ ప్రేమ సరిగమ నువ్వేగా
కాలాన్నే కదలక నిలిపినా ఆకాశం భూమిని
కలిపినా ఏదైనా వెనకన నువ్వేగా
ఎన్నెన్నో వరములు కురిసిన గుండెల్లో వలపై ఎగసిన ఈ ఆనందం నీ చిరునవ్వేగా
నీతోనే కలిసిన క్షణమున నీలోని అణువణువున నీవే నీవే నీవే నీవుగా
లోకాలే గెలవగ నిలిచినా స్నేహాల విలువలు
తెలిసినా ఈ ప్రేమ సరిగమ నువ్వేగా
చరణం 1:
ఈ పువ్వు కోరిందిరా... ప్రేమాభిషేకాలనే
నా చూపు పంపిందిలే ...పన్నీటి మేఘాలనే
బుగ్గపై చిరు చుక్కవై జుట్టువై సిరిబొట్టువై నాతోనే నువ్వుండిపో
ఊపిరై ఎద తీపినై ఊపునై కనుచూపునై నీలోనే నేనుంటినే
నీ రామచిలుకను నేనై నా రామచంద్రుడు నీవై .. కలిసే ఉంటే అంతే చాలురా !!
చరణం 2:
ఈ రాధ బృందావనం ...సుస్వాగతం అందిరా
నా ప్రేమ సింహాసనం ...నీ గుండెలో ఉన్నదే
పక్కగా రారమ్మని కమ్మగా ముద్దిమ్మని ఎన్నాళ్లు కోరాలిరా
ఎప్పుడూ కనురెప్పలా చప్పుడై ఎదలోపల ఉంటూనే ఉన్నానుగా
సన్నాయి స్వరముల మధురిమ పున్నాగ పువ్వుల ఘుమ ఘుమ.. అన్నీ నీవై నన్నే చేరరా !!
లోకాలే గెలవగ నిలిచినా స్నేహాల విలువలు
తెలిసినా ఈ ప్రేమ సరిగమ నువ్వేగా
కాలాన్నే కదలక నిలిపినా ఆకాశం భూమిని
కలిపినా ఏదైనా వెనకన నువ్వేగా
pallavi:
logāle gĕlavaga nilisinā snehāla viluvalu
tĕlisinā ī prema sarigama nuvvegā
kālānne kadalaga nilibinā āgāśhaṁ bhūmini
kalibinā edainā vĕnagana nuvvegā
ĕnnĕnno varamulu kurisina guṁḍĕllo valabai ĕgasina ī ānaṁdaṁ nī sirunavvegā
nīdone kalisina kṣhaṇamuna nīloni aṇuvaṇuvuna nīve nīve nīve nīvugā
logāle gĕlavaga nilisinā snehāla viluvalu
tĕlisinā ī prema sarigama nuvvegā
saraṇaṁ 1:
ī puvvu koriṁdirā... premābhiṣhegālane
nā sūbu paṁpiṁdile ...pannīḍi meghālane
buggabai siru sukkavai juṭṭuvai siribŏṭṭuvai nādone nuvvuṁḍibo
ūbirai ĕda tībinai ūbunai kanusūbunai nīlone nenuṁṭine
nī rāmasiluganu nenai nā rāmasaṁdruḍu nīvai .. kalise uṁṭe aṁte sālurā !!
saraṇaṁ 2:
ī rādha bṛṁdāvanaṁ ...susvāgadaṁ aṁdirā
nā prema siṁhāsanaṁ ...nī guṁḍĕlo unnade
pakkagā rārammani kammagā muddimmani ĕnnāḽlu korālirā
ĕppuḍū kanurĕppalā sappuḍai ĕdalobala uṁṭūne unnānugā
sannāyi svaramula madhurima punnāga puvvula ghuma ghuma.. annī nīvai nanne serarā !!
logāle gĕlavaga nilisinā snehāla viluvalu
tĕlisinā ī prema sarigama nuvvegā
kālānne kadalaga nilibinā āgāśhaṁ bhūmini
kalibinā edainā vĕnagana nuvvegā