పల్లవి:
అడగాలనుంది ఒక డౌటుని
sunrise లేని రోజేదనీ
మరి everydayని sunday అని
అనకుంటే తప్పు కాదా అని
అది తెలిసి ఎందువలనో పెద్దవాళ్ళు ఒప్పుకోరు
పదమంటూ స్కూలుకేసి six days తరుముతారు
హే...అయ్యయ్యో ఎంత తప్పు ఎవరూ అడగరే
హ్యాపీగా ఆడుకుంటాం అంటే వదలరే..హే...హే...హే
అడగాలనుంది ఒక డౌటుని sunrise లేని రోజేదనీ
చరణం 1:
నీ హైటే నాకు ఉంటే - అమ్మో ఎంత danger
నాక్కూడా మీసముంటే - ఏం చేస్తావు మేజర్
class miss chairలోన నేను కూర్చుంటా
comics, class books చేసి చదివిస్తా
స్కూలుకి principal sirనే అవుతా
All days holidays ఆడుకోండి అంటా
ఎగ్జాంసొస్తే అప్పుడు ఎలా మరి
మార్కులు కూడా మీరే వేస్తె సరి
హే...అయ్యయ్యో ఎంత తప్పు ఎవరూ అడగరే
హ్యాపీగా ఆడుకుంటాం అంటే వదలరే
చరణం 2:
చాలమ్మా ఆటలింక - కొంచెం ఆగు మమ్మీ
రానంటే వెళ్ళిపోతా - నో నో వద్దు డాడీ
ఆటకైనా పాటకైనా ఆఖరంటు లేదా
ఆకలేస్తే అప్పుడైనా అమ్మ గుర్తు రాదా
పిట్టలైనా పొద్దుపోతే గూడు చేరుకోవా
పిల్లలైనా పెద్దలైనా రాత్రి నిద్దరోరా
నైటే రాని చోటే చూస్తే సరి
అక్కడ ఆటకు బ్రేకులు ఉండవ్ మరి
ఎంచక్కా నిద్దరోయి కలలో జారుకో
ఆ కలతో నువ్వు కోరే చోటే చేరుకో
అడగాలనుంది ఒక డౌటుని
sunrise లేని రోజేదనీ
మరి everydayని sunday అని
అనకుంటే తప్పు కాదా అని
అది తెలిసి ఎందువలనో పెద్దవాళ్ళు ఒప్పుకోరు
పదమంటూ స్కూలుకేసి six days తరుముతారు
హే...అయ్యయ్యో ఎంత తప్పు ఎవరూ అడగరే
హ్యాపీగా ఆడుకుంటాం అంటే వదలరే
హే..హె..హే..హె..హే..హె...