Ledu ledani emdugu neelo

లేదు లేదని ఎందుకు నీలో
Work
Year
Language

పల్లవి:

లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు
ఇలా ఉరకలు వేస్తావు.. నీలో ఉన్నది దాస్తావు

ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు
లేని దానిని చేస్తావు.. నాలో ఉన్నది దోస్తావు

చరణం 1:

కొండ వాగుల కొంటె తనాల దూకుడు నీలో ఉంది
కొండ వాగుల కొంటె తనాల దూకుడు నీలో ఉంది
నల్లని జడలో కరినాగుంది.. నడకలలో అది కనపడుతుంది

లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు
ఇలా ఉరకలు వేస్తావు.. నీలో ఉన్నది దాస్తావు

చరణం 2:

కళ్ళు మూసి నిదుర పోతే.. కలలురాని వేళే లేదు
కళ్ళు మూసి నిదుర పోతే.. కలలురాని వేళే లేదు
కలలోకొచ్చి కబురులు చెప్పే.. జతగాడైనా లేడు.. జతగాడైనా లేడు

ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు
లేని దానిని చేస్తావు.. నాలో ఉన్నది దోస్తావు

చరణం 3:

దోర మాగిన దొండపండు నీ బుగ్గ సిగ్గులో ఉంది
దోర మాగిన దొండపండు నీ బుగ్గ సిగ్గులో ఉంది
మొగలి రేకుల సొగసు ఉంది.. మొన కన్నులలో పదును ఉంది

లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు
ఇలా ఉరకలు వేస్తావు.. నీలో ఉన్నది దాస్తావు

వెన్నెలొచ్చినా.. మంచుకురిసినా.. వేడి తగ్గటం లేనే లేదు
వెన్నెలొచ్చినా.. మంచుకురిసినా.. వేడి తగ్గటం లేనే లేదు
అద్దంలో నా అందం చూస్తే.. నిద్దర రానే రాదు.. నిద్దర రానే రాదు

ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు
లేని దానిని చేస్తావు.. నాలో ఉన్నది దొస్తావు

pallavi:

ledu ledani ĕṁdugu nīlo unnadi dāstāvu
ilā uragalu vestāvu.. nīlo unnadi dāstāvu

uṁdi uṁdani ĕṁdugu nālo unnadi dostāvu
leni dānini sestāvu.. nālo unnadi dostāvu

saraṇaṁ 1:

kŏṁḍa vāgula kŏṁṭĕ tanāla dūguḍu nīlo uṁdi
kŏṁḍa vāgula kŏṁṭĕ tanāla dūguḍu nīlo uṁdi
nallani jaḍalo karināguṁdi.. naḍagalalo adi kanabaḍuduṁdi

ledu ledani ĕṁdugu nīlo unnadi dāstāvu
ilā uragalu vestāvu.. nīlo unnadi dāstāvu

saraṇaṁ 2:

kaḽḽu mūsi nidura pode.. kalalurāni veḽe ledu
kaḽḽu mūsi nidura pode.. kalalurāni veḽe ledu
kalalogŏchchi kaburulu sĕppe.. jadagāḍainā leḍu.. jadagāḍainā leḍu

uṁdi uṁdani ĕṁdugu nālo unnadi dostāvu
leni dānini sestāvu.. nālo unnadi dostāvu

saraṇaṁ 3:

dora māgina dŏṁḍabaṁḍu nī bugga siggulo uṁdi
dora māgina dŏṁḍabaṁḍu nī bugga siggulo uṁdi
mŏgali regula sŏgasu uṁdi.. mŏna kannulalo padunu uṁdi

ledu ledani ĕṁdugu nīlo unnadi dāstāvu
ilā uragalu vestāvu.. nīlo unnadi dāstāvu

vĕnnĕlŏchchinā.. maṁchugurisinā.. veḍi taggaḍaṁ lene ledu
vĕnnĕlŏchchinā.. maṁchugurisinā.. veḍi taggaḍaṁ lene ledu
addaṁlo nā aṁdaṁ sūste.. niddara rāne rādu.. niddara rāne rādu

uṁdi uṁdani ĕṁdugu nālo unnadi dostāvu
leni dānini sestāvu.. nālo unnadi dŏstāvu