లేత చలిగాలులు హోయ్ దోచుకోరాదురా
పల్లవి:
లేత చలిగాలులు హోయ్ దోచుకోరాదురా
చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా
లేత చలిగాలులు దోచుకోలేవులే
మన వలపువాకిలిని అవి తాకగలేవులే
లేత చలిగాలులు హోయ్ దోచుకోరాదురా
చరణం 1:
అందాల నా కురులతో వింజామరలు వీచనా
అందాల నా కురులతో వింజామరలు వీచనా
రాగం భావం స్నేహం మోహం నిన్నే వేడనా
నీ కురులవీవెనలకు నా హృదయమర్పించనా
రూపం దీపం శిల్పం నాట్యం నీలో చూడనా
కనుల భాష్పాలు హా హా కలల భాష్యాలు లలలా లలా
వలపుగా సాగి వలలుగా మూగి కాలాన్ని బంధించగా
లేత చలిగాలులు హోయ్ దోచుకోరాదురా
చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా ఆ ఆ ఆ
లేత చలిగాలులు హ హ దోచుకోలేవులే
చరణం 2:
అధరాల కావ్యాలకు ఆవేశమందించనా
అధరాల కావ్యాలకు ఆవేశమందించనా
వలపే పిలుపై వయసే ముడుపై నిన్నే చేరనా
మందార ముకుళాలతో పాదాలు పూజించనా
అలనై కలనై విరినై ఝురినై నిన్నే కోరనా
హృదయనాదాల హా హా మధురరాగాల లలలా లలలా
చిగురు సరసాల నవవసంతాల విరిలెన్నో అందించగా ఆ ఆ ఆ
లేత చలిగాలులు హోయ్ దోచుకోలేవులే
మన వలపువాకిలిని అవి తాకగలేవులే
ఆహ హాహాహ హా హా...
pallavi:
leda saligālulu hoy dosugorādurā
sali vĕlugu vĕnnĕlalu ninu tāgagā tagavurā
leda saligālulu dosugolevule
mana valabuvāgilini avi tāgagalevule
leda saligālulu hoy dosugorādurā
saraṇaṁ 1:
aṁdāla nā kurulado viṁjāmaralu vīsanā
aṁdāla nā kurulado viṁjāmaralu vīsanā
rāgaṁ bhāvaṁ snehaṁ mohaṁ ninne veḍanā
nī kurulavīvĕnalagu nā hṛdayamarbiṁchanā
rūbaṁ dībaṁ śhilbaṁ nāṭyaṁ nīlo sūḍanā
kanula bhāṣhpālu hā hā kalala bhāṣhyālu lalalā lalā
valabugā sāgi valalugā mūgi kālānni baṁdhiṁchagā
leda saligālulu hoy dosugorādurā
sali vĕlugu vĕnnĕlalu ninu tāgagā tagavurā ā ā ā
leda saligālulu ha ha dosugolevule
saraṇaṁ 2:
adharāla kāvyālagu āveśhamaṁdiṁchanā
adharāla kāvyālagu āveśhamaṁdiṁchanā
valabe pilubai vayase muḍubai ninne seranā
maṁdāra muguḽālado pādālu pūjiṁchanā
alanai kalanai virinai jhurinai ninne koranā
hṛdayanādāla hā hā madhurarāgāla lalalā lalalā
siguru sarasāla navavasaṁtāla virilĕnno aṁdiṁchagā ā ā ā
leda saligālulu hoy dosugolevule
mana valabuvāgilini avi tāgagalevule
āha hāhāha hā hā...