కుశలమా.. నీవు కుశలమేనా?
పల్లవి:
కుశలమా.. నీవు కుశలమేనా? -
మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే..అంతే .. అంతే..
కుశలమా.. నీవు కుశలమేనా? -
ఇన్నినాళ్ళు వదలలేక ఏదో ఏదో వ్రాశాను - అంతే ..అంతే .. అంతే..
// కుశలమా //
చరణం 1:
చిన్న తల్లి ఏమంది? - నాన్న ముద్దు కావాలంది
పాలుగారు చెక్కిలి పైన - పాపాయికి ఒకటి
తేనెలూరు పెదవులపైన - దేవిగారికొకటి
ఒకటేనా.. ఒకటేనా.. - ఎన్నైనా.. ఎన్నెన్నో..
మనసు నిలుపుకోలేక - మరీ మరీ అడిగాను.. అంతే ..అంతే.. అంతే..
// కుశలమా //
చరణం 2:
పెరటిలోని పూలపానుపు - త్వర త్వరగా రమ్మంది.
పొగడ నీడ పొదరిల్లో - దిగులు దిగులుగా ఉంది.
ఎన్ని కబురులంపేనో - ఎన్ని కమ్మలంపేనో
పూలగాలి రెక్కలపైనా - నీలిమబ్బు పాయలపైనా
అందేనా.. ఆ.. ఆ ఆ ఒకటైనా..ఆ.. ఆ ఆ
అందెనులే తొందర తెలిసెనులే
ఇన్నినాళ్ళు వదలలేక - ఏదో ఏదో రాశాను
అంతే .. అంతే.. అంతే..
pallavi:
kuśhalamā.. nīvu kuśhalamenā? -
manasu nilubugolega marī marī aḍigānu aṁte..aṁte .. aṁte..
kuśhalamā.. nīvu kuśhalamenā? -
innināḽḽu vadalalega edo edo vrāśhānu - aṁte ..aṁte .. aṁte..
// kuśhalamā //
saraṇaṁ 1:
sinna talli emaṁdi? - nānna muddu kāvālaṁdi
pālugāru sĕkkili paina - pābāyigi ŏgaḍi
tenĕlūru pĕdavulabaina - devigārigŏgaḍi
ŏgaḍenā.. ŏgaḍenā.. - ĕnnainā.. ĕnnĕnno..
manasu nilubugolega - marī marī aḍigānu.. aṁte ..aṁte.. aṁte..
// kuśhalamā //
saraṇaṁ 2:
pĕraḍiloni pūlabānubu - tvara tvaragā rammaṁdi.
pŏgaḍa nīḍa pŏdarillo - digulu digulugā uṁdi.
ĕnni kaburulaṁpeno - ĕnni kammalaṁpeno
pūlagāli rĕkkalabainā - nīlimabbu pāyalabainā
aṁdenā.. ā.. ā ā ŏgaḍainā..ā.. ā ā
aṁdĕnule tŏṁdara tĕlisĕnule
innināḽḽu vadalalega - edo edo rāśhānu
aṁte .. aṁte.. aṁte..