Kuhu kuhu kogilammaa

కుహు కుహు కోకిలమ్మా
Year
Language

పల్లవి:

కుహు కుహు కోకిలమ్మా గుండె కోయకే
పూలకొమ్మ నీడలోన కట్టెలమ్మకే
అనురాగాలన్నీ కలలాయేనా
అభిమానాలన్నీ కథలాయేనా
కుహు కుహు కోకిలమ్మా గుండె కోయకే
పూలకొమ్మ నీడలోన కట్టెలమ్మకే

చరణం 1:

నిన్నటి తోడే వెన్నెల నీడై జ్ఞాపకమైపోయెనే
మూయని కన్నే రేయిగ మారే చీకటి నా పేరులే
మదిలో కదిలి మనసే అడిగి
బదులే తోచని బరువైపోతివి నా కొన ఊపిరిలో

కుహు కుహు కోకిలమ్మా గుండె కోయకే
పూలకొమ్మ నీడలోన కట్టెలమ్మకే

చరణం 2:

తియ్యని స్నేహం తీరని దాహం జీవితమే చేదులే
ఇచ్చిన మనసు పెంచిన వలపు ఎన్నటికీ రావులే
క్షణమే యుగమై బ్రతుకే సగమై
పెదవే దోచని పదమైపోతివి జీవన లాహిరిలో

కుహు కుహు కోకిలమ్మా గుండె కోయకే
పూలకొమ్మ నీడలోన కట్టెలమ్మకే
అనురాగాలన్నీ కలయేలానా
అభిమానాలన్నీ కథలాయేనా
కుహు కుహు కోకిలమ్మా గుండె కోయకే
పూలకొమ్మ నీడలోన కట్టెలమ్మకే

pallavi:

kuhu kuhu kogilammā guṁḍĕ koyage
pūlagŏmma nīḍalona kaṭṭĕlammage
anurāgālannī kalalāyenā
abhimānālannī kathalāyenā
kuhu kuhu kogilammā guṁḍĕ koyage
pūlagŏmma nīḍalona kaṭṭĕlammage

saraṇaṁ 1:

ninnaḍi toḍe vĕnnĕla nīḍai jñābagamaiboyĕne
mūyani kanne reyiga māre sīgaḍi nā perule
madilo kadili manase aḍigi
badule tosani baruvaibodivi nā kŏna ūbirilo

kuhu kuhu kogilammā guṁḍĕ koyage
pūlagŏmma nīḍalona kaṭṭĕlammage

saraṇaṁ 2:

tiyyani snehaṁ tīrani dāhaṁ jīvidame sedule
ichchina manasu pĕṁchina valabu ĕnnaḍigī rāvule
kṣhaṇame yugamai braduge sagamai
pĕdave dosani padamaibodivi jīvana lāhirilo

kuhu kuhu kogilammā guṁḍĕ koyage
pūlagŏmma nīḍalona kaṭṭĕlammage
anurāgālannī kalayelānā
abhimānālannī kathalāyenā
kuhu kuhu kogilammā guṁḍĕ koyage
pūlagŏmma nīḍalona kaṭṭĕlammage