Kshemamaa..priyadamaa

క్షేమమా..ప్రియతమా
Year
Language

పల్లవి:

ఏహే ఏహే లాలలాలలా
ఆహా ఆహా లాలలాలలా

క్షేమమా.. ప్రియతమా ..సౌఖ్యమా.. నా ప్రాణమా..
కుసుమించే అందాలు కుశలమా
వికసించే పరువాలు పదిలమా
మరల మరల వచ్చిపో వసంతమా
చూసిపోవే నన్ను సుప్రభాతమా (2)

చరణం 1:

నీలి కురుల వాలు జడల చాటు నడుము కదలిక కుశలమా
అడగలేక అడుగుతున్న తీపి వలపు కానుక పదిలమా

నీలోని దాహాలు అవి రేపే విరహాలు చెలరేగే మోహాలు క్షేమమా..(నీలి కురుల)

చలి గాలి గిలిగింత సౌఖ్యమా..చెలి మీద వలపంతా సౌఖ్యమా..
నీ క్షేమమే..నా లాభము .. నీ లాభమే..నా మోక్షము //క్షేమమా//

చరణం 2:

కాలమల్లె కరిగిపోని గాఢమైన కౌగిలి కుశలమా
నన్ను తప్ప ఎవరినింక తాకలేని చూపులు పదిలమా

నీ నీలి కడకొంగు ఆలోని ఎద పొంగు అవి దాచే నీ సిగ్గు క్షేమమా (కాలమల్లె)

తహతహలు తాపాలు సౌఖ్యమా..బిడియాలు బింకాలు సౌఖ్యమా
నీ సౌఖ్యమే..నా సర్వమూ .. ఆ సర్వమూ..నా సొంతమూ //క్షేమమా//

pallavi:

ehe ehe lālalālalā
āhā āhā lālalālalā

kṣhemamā.. priyadamā ..saukhyamā.. nā prāṇamā..
kusumiṁche aṁdālu kuśhalamā
vigasiṁche paruvālu padilamā
marala marala vachchibo vasaṁtamā
sūsibove nannu suprabhādamā (2)

saraṇaṁ 1:

nīli kurula vālu jaḍala sāḍu naḍumu kadaliga kuśhalamā
aḍagalega aḍugudunna tībi valabu kānuga padilamā

nīloni dāhālu avi rebe virahālu sĕlarege mohālu kṣhemamā..(nīli kurula)

sali gāli giligiṁta saukhyamā..sĕli mīda valabaṁtā saukhyamā..
nī kṣhemame..nā lābhamu .. nī lābhame..nā mokṣhamu //kṣhemamā//

saraṇaṁ 2:

kālamallĕ karigiboni gāḍhamaina kaugili kuśhalamā
nannu tappa ĕvariniṁka tāgaleni sūbulu padilamā

nī nīli kaḍagŏṁgu āloni ĕda pŏṁgu avi dāse nī siggu kṣhemamā (kālamallĕ)

tahadahalu tābālu saukhyamā..biḍiyālu biṁkālu saukhyamā
nī saukhyame..nā sarvamū .. ā sarvamū..nā sŏṁtamū //kṣhemamā//